*ఓంకారం విశిష్టత.*
*ఓంకారం విశిష్టత.* *మనలో చాలామంది ప్రశాంతత కోసం నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతం రూపంలో ఆస్వాదిస్తారు.* *పంచభూతాల్లో శబ్దం అన్నింటికంటే ముందు ఉంటుందని పండితులు చెబుతారు. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారం.* *నిజానికి ఓంకారం ప్రతి దేహంలో ఉంటుంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితం అవుతుంది.* *‘ఓం’ అన్నది మంత్రం కాదు..! మత సంబంధమైనది అసలే కాదు.. వేదాలలో నిక్షిప్తమైన ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం.* *ప్రాచీన కాలంలో ఋషులు వాతవారణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతంగా ఉండటం వెనుక ఓంకార నాదమే రహస్యం.* *విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో జరిపిన పరిశోధనల్లో సైతం ఓంకారం మృత్యుంజయ జపం అని బయటపడింది.* *ఓంకారాన్ని, మతాన్ని ముడిపెట్టడం వల్ల ఓంకారం చేసే మేలు పరిమితం అవుతుంది.* *ఓంకారం ఉచ్ఛరించడం వల్ల కలిగే ప్రయోజనాలు…* *నాభిలోంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది.* *ఓ...