tirupati లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
tirupati లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, డిసెంబర్ 2024, శుక్రవారం

తిరుమల శ్రీవారి ఆలయం… ఏడుకొండలపై ఉందని అందరికీ తెలుసు. మరి ఆ ఏడుకొండలు ఎక్కేందుకు ఏడు మార్గాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు

 



తిరుమల శ్రీవారి ఆలయం… ఏడుకొండలపై ఉందని అందరికీ తెలుసు. మరి ఆ ఏడుకొండలు ఎక్కేందుకు ఏడు మార్గాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు..? ఆ ఏడు మార్గాల్లో… ఏ దారి నుంచి వెళ్లినా… తిరుమల చేరుకోవచ్చు.

ఆ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కలియుగ ప్రత్యక్ష దైవం వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల. ఏడుకొండలపై కొలువైన శ్రీనివాసుడిని ఒక్క క్షణమైనా కళ్లారా చూస్తే చాలని భక్తులు పరితపిస్తుంటారు. రోజూ వేలాది మంది తిరుమలకు క్యూకడుతుంటారు. తిరుపతి చేరుకున్నాక… తిరుమల కొండకు వెళ్లేందుకు… బస్సులు, ప్రైవేట్‌ జీపులు, టాక్సీలను ఆశ్రయిస్తారు. కొంతమంది అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గం నుంచి కాలినడకన వెళ్తుంటారు. ఇవి కాకుండా… తిరుమల వెళ్లేందుకు ఇంకొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ఏడుకొండలు ఎక్కేందుకు ఏడు మార్గాలు ఉన్నాయి. వాటిలో మొదటిది అలిపిరి. ఇది అందరికీ తెలిసిన దారే. తిరుమల వెళ్లేందుకు ప్రధాన మార్గం కూడా ఇదే. బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేట్‌ జీపులు… అన్నీ అలిపిరి నుంచే వెళ్తాయి. కాలినడకన కొండెక్కేవారు మొదట ఎంచుకునేది కూడా అలిపిరి మార్గమే. ఎందుకంటే ఇది… తాళ్లపాక అన్నమాచార్య నడిచిన మార్గం. ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్లు నడవాలి. కొంత నడకమార్గం కాగా… 3650 మెట్లు ఉంటాయి. ఈ మార్గం నుంచి వెళ్తే.. ఎన్నో ఉపాలయాలు, మోకాళ్ల పర్వతాన్ని దర్శించుకోవచ్చు.
రెండో మార్గం.. శ్రీవారి మెట్టు మార్గం. ఇది కొంతమందికి మాత్రమే తెలుసు. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం నుంచి… మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీవారు పద్మావతి అమ్మవారిని వివాహమాడిన శ్రీనివాసుడు… తిరుమలకు ఈ మార్గం నుంచే వెళ్లారట. అందుకే దీనికి శ్రీవారి మెట్టు అని పేరొచ్చింది. శ్రీవారి మెట్టు నుంచి మూడుకిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మార్గంలో వెళ్తే… గంటన్నరలో తిరుమల చేరుకోవచ్చు.
మూడో మార్గం.. మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యంలో ఉంటుంది. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుంచి వచ్చే భక్తులు ఈ మార్గం నుంచి… శ్రీవారి ఆలయం చేరుకుంటారు. ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాతి మెట్లను ఏర్పాటుచేశారు.
నాలుగో మార్గం… కళ్యాణి డ్యామ్‌. తిరుమల కొండకు పశ్చిమం వైపున ఉంటుంది. డ్యామ్‌ నుండి 3 కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. డ్యాం నుండి తిరుమల మధ్య దూరం 15 కిలోమీటర్లు. రంగంపేట, భీమవరం వచ్చే భక్తులు ఈ మార్గం నుంచే తిరుమల చేరుకుంటారు.
ఐదో మార్గం… తుంబురుతీర్థం. కడప సరిహద్దు-చిత్తూరు ఎంట్రెన్స్‌ దగ్గర కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుంచి తుంబురుతీర్థం, పాపవినాశనం మీదుగా తిరుమల చేరుకోవచ్చు. తుంబురుతీర్థం నుంచి పాపవినాశనం మధ్య 12 కిలోమీటర్లూ దూరం ఉంటుంది. పాపవినాశనం నుంచి సులువుగా తిరుమల చేరుకోవచ్చు.
ఆరో మార్గం.. అవ్వాచారి కోన. ఏడుకొండల మధ్యలో ఉన్న కొంత పల్లపు ప్రాంతాన్నే అవ్వాచారి కోన అంటారు. దీనినే అవ్వాచారి కొండ అని కూడా పిలుస్తారు. అవ్వాచారికొండ…. మొదటి ఘాట్‌రోడ్డులోని అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంటుంది. రేణిగుంట సమీపంలోని కడప-తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉంది. అక్కడి నుంచి లోయలో ఉన్న అవ్వాచారి కోన మీదుగా పడమరవైపుకి వెళ్తే… మోకాళ్ల పర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.
ఏడో మార్గం… తలకోన. ఇక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. తిరుమల కొండకు తల భాగంలో ఉంటుంది కనుకే.. దీనికి తలకోన అని పేరువచ్చింది. తలకోన జలపాతం నుంచి నడుచుకుంటూ జెండాపేట దారిలో వెళితే తిరుమల వస్తుంది. ఈ మార్గం 20 కిలోమీటర్లు ఉంటుంది.

19, డిసెంబర్ 2024, గురువారం

తిరుమల శ్రీవారి ఆలయంలో అతిపెద్ద పూలబావి..!!

 


తిరుమల శ్రీవారి ఆలయంలో అతిపెద్ద పూలబావి..!!
🌿ఆపద మ్రొక్కులవాడు కొలువై ఉన్న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అతి పెద్ద బావి ఉంది. స్వామివారికి అలంకరించిన తులసి, పుష్పం, పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం లేదు.
🌸 స్వామివారికి అలంకరించిన తులసి, పుష్పం, పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం లేదు. అందువల్ల ఆ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఆలయంలోని బావిలో వేస్తారు. ఈ బావినే పూలబావి అంటారు.
🌿పూల బావికి మరో పేరుంది. అదే భూతీర్థం. పూర్వం తిరుమల క్షేత్రంలో భూదేవి చేత ఏర్పరబడిన ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమై పోయింది. అనంతరం శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తులు ఒక బావిని తవ్వగా భూ తీర్థం మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
🌸రంగదాసు ఆ బావిలోని నీళ్లను వాడుతూ, శ్రీ వేంకటేశ్వరుని పూజకై సంపెంగ చేమంతుల మ్రొక్కలతో ఒక తోటను పెంచాడు. మళ్లీ ఆ రంగదాసుడే తొండమాను చక్రవర్తిగా జన్మించగా శ్రీ వేంకటేశ్వరస్వామి గత జన్మలో అతను నిర్మించిన ఈ శిథిలమైన బావిని మళ్ళీ పునరుద్ధరించమని ఆదేశించగా
🌿 తొండమానుడు దానిని రాతితో కట్టి పునరుద్ధరించి శ్రీ స్వామివారికి ప్రతి పాత్రుడై ఉంటే అవసరమైనప్పుడు ఆ బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసున్ని దర్సించుకుని వెళుతూ ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి.
🌸ఒకప్పుడు యుద్ధంలో శత్రువులతో తరుమబడిన తొండమానుడు రహస్య బిలం ద్వారా పరుగు పరుగున వచ్చి శ్రీనివాసుని చేరాడంట. ఏకాంతసేవ సమయంలో శ్రీనివాసునితో ఉన్న వేళలో అభ్యంతర మందిరంలోకి ప్రవేశించిన తొండమానుణ్ణి చూసి సిగ్గుతో శ్రీదేవి శ్రీస్వామివారి వక్ష స్థలంలోను, భూదేవి తొండమానుడు కట్టించిన ఈ బావిలోను దాక్కొన్నారట. వరాహ పురాణాంతర్గత వేంకటాచల మహత్మ్యం అంతా ఇంతా కాదు.
🌿ఆ తర్వాత భగవద్రామానుజుల వారు తిరుమలకు వేంచేసి ఉన్నప్పుడు ఈ భూతీర్థంమనెడి బావిని చూసి అందులో భూదేవి, శ్రీదేవి దాగి కొనుట అనెడి పురాణ ప్రవచనాన్ని బట్టి, ఆ బావిలోనే భూదేవిని ప్రతిష్టించి, తీర్థాధిపతిగా శ్రీనివాసునికి అర్చన నివేదనాదులు జరుగుతున్నట్లు ఏర్పాటు చేశారని,
🌸 అంతే కాకుండా ప్రతిరోజు శ్రీ స్వామివారికి అలంకరింపబడి తొలగింపబడే నిర్మాల్యాన్ని భూదేవి కోసమే ఈ బావిలో వేసేట్లుగా నిర్ణయించారని శ్రీ వేంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథం తెలుపుతున్నది.
🌿అప్పటి నుంచి నిత్యమూ పుష్పాంకార ప్రియుడైన శ్రీనివాసునికి అలంకరించి తొలగించిన తులసి, పూలమాలలు ఈ బావిలో సమర్పించడం జరుగుతోంది. కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, అదీ తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవ సమయంలో మాత్రమే తిరుచానూరు పంచమీతీర్థం రోజున తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి అలంకరించిన పూలమాలలు, పసుపు కుంకమలు, పరిమళ ద్రవ్యాలు, చీర, రవికలు, లడ్డూలు, వడలు తదితర ప్రసాదాలు ఛత్రచామర బాజాభజంత్రీలు వగైరా సకల రాజోపచారాలతో వృష, గజ తురగ భక్త బృందాలతో తిరుమల నుంచి కాలినడకన తిరుచానూరుకు వెళ్ళి శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు.
🌸అదేరోజు అమ్మవారికి వాటిని అలంకరించిన తరువాత చక్రస్నానం జరుగుతుంది. ఇలా నేటికీ జరుగుతూ ఉన్న సనాతన సాంప్రదాయం ఇది. ఈ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో శ్రీవారి నిర్మాల్యాన్ని ఈ బావిలోనే సమర్పించడం జరుగుతోంది.
🌿అయితే ఇటీవల కాలంలో తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే సేవల్లోను విశేషంగా పుష్పాలంకరణ జరుగుతతున్నందు వల్ల విపరీతంగా పేరుకుపోతున్న ఈ నిర్మాల్యాన్ని తిరుమల పర్వత సానువుల్లో ఎవరూ తొక్కని చోట జారవిడవటం జరుగుతోంది.
🌸ఈ పూలబావి పూర్వం మెట్లు ఉన్న దిగుడు బావిగా ఉండేది. ఆ తరువాత కాలంలో చుట్టూ రాతి గోడతో ఈ బావి గుండ్రమైన చేదురుబావి వలె పునర్నిరమింపబడింది.
🌿ఇటీవల ఈ బావిపై ఇనుపకడ్డీల తడకను కప్పి వాటిపై పూల కుండీలను ఏర్పాటు చేశారు. శ్రీదేవి, భూదేవి, పరమ భక్తాగ్రేసరుడైన తొండమాను చక్రవర్తిని, భగవద్రామానుజల వారిని, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని స్మరింపజేస్తూ శ్రీవారి పవిత్ర నిర్మాల్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటోంది ఈ పూల బావి ఎంతో గొప్పది కదా.!.
🌹ఓం నమో వెంకటేశాయ 🌹

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

  తిరుమల  వేంకటేశ్వర స్వామి  ధృవబేరము 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరా...