spirtual లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
spirtual లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, డిసెంబర్ 2024, శనివారం

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

 



తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం.


🌿ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. ఈ మూర్తి స్వయంభూమూర్తి (అనగా స్వయంగా వెలసినది, ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు) అని భక్తుల విశ్వాసం.



🌸మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. 


🌿మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు.


🌸నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.


🌿18 అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు. గురువారం సాయంకాలం, మరియు శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక, స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి


🌸ధృవబేరం చక్కని ముఖకవళికలతో వెలసి ఉంటుంది. ముక్కు మరీ ఎత్తూ కాదు, చప్పిడీ కాదు. కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి. నుదుటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంది.


🌿నిత్యం పచ్చకర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంతభాగం కప్పివేస్తుంది. నామం రూపం, సైజూ వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పినవిధంగా కచ్చితంగా పాటిస్తారు. 


🌸స్వామివారి శిరస్సుపై (నుదుటిపైభాగం వరకు) కిరీటం ఉంది. ఆయన జటాజూటము భుజాలపై పడుతూ ఉంటుంది. 


🌿కచ్చితమైన కొలతలు తీసికొనబడనప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు సుమారు 36-40 అంగుళాల మధ్య సైజులోనూ, నడుము భాగం వెడల్పు 24-27 అంగుళాలు సైజులోనూ ఉంటుంది. 


🌸స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది. ఆయన వక్షస్థలం కుడిభాగాన శ్రీలక్ష్మీదేవి రూపం ఉంది.


🌿స్వామివారు చతుర్భుజములను కలిగియున్నారు. పై కెత్తిన కుడిచేతిలోనున్న సుదర్శన చక్రము, ఎడమచేతిలోనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. 


🌸అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు. దిగువనున్న రెండుచేతులలోను కుడిచేయి వరదహస్తము (అరచేయి భక్తులకు కనిపిస్తూ, వరములను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది).


🌿ఎడమచేయి కట్యావలంబిత ముద్రలో (నడుమువద్ద మడచినచేయి. అరచేయి స్వామివారివైపు ఉంటుంది) ఉంది. నడుము క్రిందభాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు.


🌸రెండు మోకాళ్ళూ కొంచెంగా వంగినట్లు కనిపిస్తాయి (స్వామివారు భక్తుల రక్షణకు నడచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా). 


🌿స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్బాణాల ముద్రలున్నాయి.. సేకరణ... స్వస్తి...🚩🌞🙏🌹🎻

19, డిసెంబర్ 2024, గురువారం

*ఓంకారం విశిష్ట‌త‌.*

 


*ఓంకారం విశిష్ట‌త‌.*
*మ‌న‌లో చాలామంది ప్ర‌శాంత‌త కోసం నిశ్శ‌బ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎంద‌రో శ్ర‌వ‌ణానందం క‌లిగించే శ‌బ్దాన్ని సంగీతం రూపంలో ఆస్వాదిస్తారు.*
*పంచ‌భూతాల్లో శ‌బ్దం అన్నింటిక‌ంటే ముందు ఉంటుంద‌ని పండితులు చెబుతారు. ఆ శ‌బ్దం ఆకాశం నుంచి వ‌స్తుంది. శ‌బ్దానికి ఆధారం ఓంకారం.*
*నిజానికి ఓంకారం ప్ర‌తి దేహంలో ఉంటుంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితం అవుతుంది.*
*‘ఓం’ అన్న‌ది మంత్రం కాదు..! మ‌త సంబంధ‌మైన‌ది అస‌లే కాదు.. వేదాల‌లో నిక్షిప్త‌మైన ఓంకార నాదం మానవ ఆరోగ్య ర‌హ‌స్యానికి ఒక సూత్రం.*
*ప్రాచీన కాలంలో ఋషులు వాత‌వార‌ణ ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుని ఉప‌వాస దీక్ష‌ల‌లో కూడా ఆరోగ్య‌వంతంగా ఉండ‌టం వెనుక ఓంకార నాద‌మే ర‌హ‌స్యం.*
*విదేశాల్లోని విశ్వ‌విద్యాల‌యాల్లో జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో సైతం ఓంకారం మృత్యుంజ‌య జ‌పం అని బ‌య‌ట‌ప‌డింది.*
*ఓంకారాన్ని, మ‌తాన్ని ముడిపెట్ట‌డం వ‌ల్ల ఓంకారం చేసే మేలు ప‌రిమితం ‌ అవుతుంది.*
*ఓంకారం ఉచ్ఛ‌రించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు…*
*నాభిలోంచి ల‌య‌బ‌ద్ధంగా ఓంకార ప‌దాన్ని ప‌ల‌క‌గ‌లిగితే మాన‌వుడి ఆరోగ్యం ప‌రిపూర్ణంగా ఉంటుంది.*
*ఓంకారం ప‌దిహేను నిమిషాల పాటు ఉచ్చ‌రించ‌గ‌లిగితే ర‌క్త‌పోటు త‌గ్గుతుంది.*
*ర‌క్త‌ ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రిగి గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.*
*మాన‌సిక అల‌స‌ట‌, అల‌జ‌డి త‌గ్గి ప్ర‌శాంతత క‌లుగుతుంది.*
*ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌డుతుంది.*

18, డిసెంబర్ 2024, బుధవారం

పళని మురుగన్‌ మహత్యం

 

పళని మురుగన్‌ మహత్యం

అంతుబట్టని నవ పాషాణం!


అటు చరిత్రకీ ఇటు శాస్త్రీయతకీ అందని అసాధారణ నైపుణ్యానికీ విజ్ఞానానికీ చూడచక్కని ఆనవాళ్లు భారతీయ దేవాలయాలు.


వాస్తునిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే, మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని. అలాంటివాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం.




సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్య క్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలోని ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నులపండువగా జరుగుతుంది. అందులో పాల్గొన్నవాళ్లకి సంతానప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు.


నిరవధికంగా పదహారు గంటలపాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసం, వైకాశి, అగ్నినక్షత్రం... ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేర రాజు చేరమాన్‌ పెరుమాళ్‌ పునర్నిర్మించినట్లూ ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లూ తెలుస్తోంది.


నిజానికి విగ్రహం క్రీ.పూ. మూడువేల సంవత్సరాలనాటిదనీ చాలాకాలం నిర్లక్ష్యానికి గురైందనీ, చేరమాన్‌ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెబుతారు.ఆదిత్యయోగీ.


మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళని. పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండమీద ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతోపాటు రోప్‌ వే లాంటి సౌకర్యమూ ఉంది. గర్భగుడిలోని స్వామి పదేళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకుని కౌపీనధారిగా దర్శనమిస్తాడు. 


"అన్నీ వదిలేసి నన్ను చేరుకో" 

అన్నదే స్వామి అలా కనబడటంలోని అంతరార్థమట. ఇక్కడి సుబ్రహ్మణ్యుడిని దండాయుధపాణి, బాల సుబ్రహ్మణ్యం, మురుగన్‌, శరవణన్‌... ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు.


"స్థలపురాణం"

ప్రమద గణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికీ శివుడు పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి, నిరాశతో ప్రస్తుతం పళని ఆలయం ఉన్న పర్వతం మీదకు చేరుకుని మౌనంగా కూర్చుండిపోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుణ్ణి బుజ్జగించి, ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకూ అధిపతివి నీవే అని చెబుతూ జ్ఞానఫలాన్ని అందించారట. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండమీదే కొలువుంటానని తల్లితండ్రులకు చెబుతాడు. దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి జ్ఞానం సిద్ధిస్తుందనీ శివుడు వరమిస్తాడట. తమిళంలో 'పళం' అంటే 'ఫలం', 'నీ' అంటే 'నీవు' అని అర్థం. అందుకే ఇది పళని అయ్యిందట.


కావడీ ఉత్సవం!

దేవదానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే, ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని దగ్గరకు వస్తాడు. శరణు కోరినవాడిని చంపడం భావ్యం కాదని భావించిన ఆ ఋషి, కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి రెండు కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి, శక్తిగిరి అనే రెండు పర్వతాలను కావడిలో భూమిమీదకు తీసుకువస్తాడు. పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువవడంతో- కావడిని కిందపెట్టి సేదతీరతాడు ఇడుంబుడు. కావడిని మళ్లీ పైకెత్తబోతే అది లేవదు సరికదా, అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు- కొండమీదకి పరుగెడతాడు. చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి, మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి, కావడీలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్ళకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు. 'నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తార'నీ చెబుతాడు. అందుకే కావళ్లలో పాలు, నెయ్యి, విభూతి, తేనె, పూలు... వంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందనీ దాంపత్య దోషాలు తొలగిపోతాయనీ నమ్ముతారు.


ఏమిటీ నవ పాషాణం!

పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు పళని ఆలయాన్ని తప్పక సందర్శించేవారు. ఆలయంలోని మూలవిరాట్టుని దర్శించుకుని, తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులూ తొలగిపోతాయని నమ్మేవారు.


దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే. కానీ ఇక్కడి స్వామి మూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాలతో "భోగర్‌" అనే సిద్ధుడు తయారుచేశాడట. అందుకే దీన్ని నవ పాషాణం అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త, తొమ్మిది అనీ; పాషాణ అంటే విషం, ఖనిజం అనీ అర్థాలు ఉన్నాయి. భోగర్‌ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటినుంచి తొమ్మిది విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారుచేశాడని కొందరంటే, అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో తొమ్మిదింటిని సేకరించి ఈ నవపాషాణాన్ని చేశాడని మరికొందరు సిద్ధ వైద్యులు చెబుతున్నారు. ఎలా చేసినప్పటికీ ఔషధగుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలూ పంచామృతాలు మందులా పనిచేస్తాయట. అప్పట్లో స్వామివారి ఊరువు భాగం నుంచి తీసిచ్చిన విభూతితో కుష్టురోగం నయమయ్యేదని అంటారు. క్రమేణా ఆ భాగం అరిగిపోతుండటంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట. ఈ విగ్రహానికి స్వేదం (చెమట) పట్టడం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందనీ, గంధంతోపాటు కారే నీటిచుక్కలు ఆకుపచ్చరంగులో ఉంటాయనీ అంటారు. వీటిని ఒడిసిపట్టేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు. దీన్నే కౌపీనతీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అయితే విగ్రహాన్ని లక్షలకొద్దీ బ్యాక్టీరియాలతో చేసి ఉంటారనీ, అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడంవల్ల ఆ బ్యాక్టీరియా లోపలకు వెళ్లి వాటి సంఖ్య పెరగడంవల్లే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణమన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన.ఆదిత్యయోగీm


"ఎవరీ సిద్ధ భోగర్‌?"

క్రీ.పూ. 550-300 కాలానికి చెందిన భోగర్‌ పళని కొండల సమీపంలోని వైగావూర్‌లో జన్మించాడు. ఈయన తన తల్లి, తాతల దగ్గర విద్యను అభ్యసించి, కాలంగి నాథర్‌ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడనీ ఆయన రాసిన సప్తకంద పుస్తకం ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయేవారట. కారణమేంటనేది తెలిసేది కాదు. దాంతో భోగర్‌ కలియుగంలో వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్‌ విగ్రహాన్ని రూపొందించి, పూజించాడట. కన్నివాడిలోని మైకంద సిద్ధర్‌ గుహలో పులిప్పాని అనే ప్రధాన శిష్యుడి సాయంతో భోగర్‌ దీన్ని తయారుచేసి, పళని కొండమీద ప్రతిష్ఠించాడనీ, ఆపై విగ్రహాన్ని పాలూ పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడనీ చెబుతారు. విగ్రహం ఉన్న కొండ కింద గుహలోనే భోగర్‌ జీవసమాధిలోకి వెళ్లినట్లు చెబుతారు.


తమిళనాట పేరొందిన పద్ధెనిమిది మంది సిద్ధుల్లో కాలంగి నాథర్‌ ఒకరు. గురువైన కాలంగి నాథర్‌ చివరి కోరిక మేరకు భోగర్‌ తన విద్యను వ్యాప్తి చేసేందుకు చైనాకు వెళ్లినట్లూ; శ్రీలంక మీదగా తామ్రపర్ణియన్‌ అనే సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లూ సప్తకందలో రాసుకున్నాడు. పులిప్పాని వంశీకులు పదహారో శతాబ్దం వరకూ ఈ ప్రాంతంలో ఉండేవారనడానికి ఆధారాలున్నాయి. పైగా ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులెందరో ప్రయత్నించారు. కానీ ఏమిటనేది తెలియలేదు. అయితే "గట్టి లింగం, గుర్రంపన్ను, నల్ల పాషాణం, రస సింధూరం, తెల్ల పాషాణం, రక్త పాషాణం, కంబి నవరసం, కౌరి పాషాణం, సీలై పాషాణం" ఇలా తొమ్మిది రకాల విషపూరిత ఔషధ మూలికలతో ఈ విగ్రహాన్ని తయారుచేశారని కొందరంటారు. ఆ మూలికలకోసం కొందరు వ్యక్తులు ఈ విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారనీ అంటారు. 


అందుకే... పళని మురుగన్‌ నవపాషాణం అన్నది కేవలం విశ్వాసం కాదు, అంతుబట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం..!


పంచామృతం!

లడ్డూ ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తుకొచ్చినట్లే, పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తుకొచ్చేది పళని సుబ్రహ్మణ్యస్వామే. మహత్తరమైన రుచీ ఔషధ, పోషక గుణాలున్న ప్రసాదం. ఇది కొన్ని నెలలు నిల్వ ఉంటుందట. ఎంత పాతబడితే అంత రుచి అనీ అంటారు. అందుకే స్వామివారి దర్శనానంతరం ఆ ప్రసాదం డబ్బా లేకుండా భక్తులు వెనుతిరగరు. పళని కొండల్లోని విరుప్పాచ్చి అనే ఊళ్లో మాత్రమే పండే వేలెడంత సైజు తియ్యని అరటిపండ్లను చిదిమి దానికి కంజీయం ప్రాంతంలో పండించే చెరకుతో చేసిన ముడి పంచదార చేర్చి, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, యాలకులు, నెయ్యి సరైన పాళ్లలో కలిపి తయారుచేస్తారు....*






12, డిసెంబర్ 2024, గురువారం

పంచారామాలు

 🙏🏵️🙏పంచారామాలు🙏🏵️🙏



1. దాక్షారామము :

పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడు" అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరియు  సగభాగం నలుపుతో ఉంటుంది.ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు.


2. అమరారామము :

పంచారామల్లో రెండవదైన 'అమరారామము', గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీతీరమునందు వెలసినది. ఇక్కడ స్వామిని "అమరేశ్వరుడు" అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో, తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.

అమరేశ్వరుడైన 'ఇంద్రుడు' చేత ప్రతిష్టించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడి యున్నది.


3. క్షీరారామము :

క్షీరారామము, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ 'శివుని' మూర్తిని "శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి" అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో 'సీతారాములు' కలిసి ప్రతిష్ఠించారట.  ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. 'శివుడు' తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట.  క్షీరం అనగా పాలు, దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది. క్రమంగా 'క్షీరపురి' కాస్తా 'పాలకొల్లుగా' మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో '9' గోపురాలుతో కట్టబడింది.


4. సోమారామము :

పంచరామాల్లో నాల్గవదైన "సోమారామము". పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని "సోమేశ్వరుడు" అని పిలుస్తారు. ఇచ్చట 'శివలింగానికి' ఒక ప్రత్యేకత ఉంది. మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే 'శివలింగం', అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.ఇక్కడ స్వామిని 'చంద్రుడు' ప్రతిష్టించాడు. చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి 'సోమారామము' అని పేరు వచ్చింది.


5. కుమారభీమారామము :

పంచారామాల్లో చివరిది, 5వది అయిన 'కుమారభీమారామము', తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు. ఇక్కడ స్వామిని "కాల బైరవుడు" అని పిలుస్తారు.ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన, చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు.

.

#pancharamalu

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలు:

 శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలు:



శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం.


ఆంద్రప్రదేశ్ లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది.


తిరుచందూర్: సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్ లో ఉంది. సరన్ అనే రాక్షస రాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్ లో కొలువై నిలిచారట. తిరుచందూర్ లోని సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం.


స్వామిమలై: స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశము చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు.


పళని: ఆంద్రప్రదేశ్ లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి వుందో తమిళనాడులో పళవి క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళవిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.


తిరుత్తణి: తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలోనూ విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని సుబ్రమణ్యస్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.


పరిముదిర్ చోళై: దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రం కూడా సుబ్రమణ్యస్వామి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. పైన పేర్కొన్న క్షేత్రాలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.


తిరువరన్ కున్రమ్: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే ఈ తిరుపరన్ కున్రమ్ క్షేత్రం కూడా కొలువై ఉంది. తన ఇద్దరూ భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రమణ్యస్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్ కున్రమ్.


తిరువన్నామ్మలై కృత్తికా దీపం

 తిరువన్నామ్మలై కృత్తికా దీపం, తిరుకార్తీగై దీపం రోజున తిరుకార్తీగై దీపం ఎవరు వెలిగిస్తున్నారు? మీరు ఆ హక్కును ఎలా పొందారు?





ప్రపంచమంతట నిలుస్తున్న మామలైపై మహాజ్యోతిని చూసే భాగ్యం ఉంటే, అన్నామలైపై మహాజ్యోతిని వెలిగించడం ఎంత భాగ్యం! తలచుకుంటేనే ఈ పనిని తాకి నెరవేర్చినందుకు పర్వత  రజకులాలు గర్వపడుతున్నాయి.


తిరువన్నామలై కార్తీగైలో జరిగిన దీపోత్సవం ముగింపు సందర్భంగా అన్నామలైపై మహాదీపం వెలిగించి అప్పని తీర్చుకునే హక్కును సాధించారు. తిరువన్నామలై నగరంలోనే సుమారు 2 వేల కుటుంబాలున్నాయి. వారిలో ఐదుగురు వారసుల కుటుంబం పర్వతంపై దీపం వెలిగించే హక్కును అమలు చేస్తున్నారు. 


రాజకులాలకు శ్రీవారి జోతి ఎత్తే హక్కు ఎలా వచ్చింది?

పర్వత  రజకుల వంశానికి పుత్రికగా జన్మించిన పార్వతీ దేవి. మత్స్యకార పరిశ్రమ కారణంగా రుతుపవన రాజాలను మత్స్యకారులు అని పిలిచారు, మరియు సెంపన్ తో తయారు చేసిన పడవలో చేపలు పట్టడం వల్ల కాపర్లు అని పిలవ తిరువణ్ణామలై కొండ పైన మహా దీపం వెలిగించే పనిని నెరవేరుస్తున్న పార్వతి దేవియర్ వారు.


ఒకప్పుడు బ్రహ్మ ఋషి ధ్యానం కరిగించే పనిలో రాక్షసులు పాల్పడ్డారు. బ్రహ్మ ఋషులు కోపం వస్తే చేపలు ఏర్పడి సముద్రంలో దాక్కుంటారు. రాక్షసులను నాశనం చేసి తపస్సును మెరుగుపరచమని ఋషులు శివుడిని వేడుకున్నారు.పరువదరాజన్ అనే సేవకులలో నీచమును గ్రహించిన శివుడు. సముద్రంలో చేపల రూపంలో దాగిన రాక్షసులను నాశనం చేయాలని ఆదేశించాడు. దానికి సహాయం చేసి జ్ఞాన వల మరియు విశ్వకర్మ దేవత సృష్టించిన సెంబోన్ బోటును ఇచ్చాడు.


సముద్రంలోకి దూసుకెళ్లిన పరువదరాజన్ చేపల ఆకారపు రాక్షసులను పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. విపరీతమైన నిస్సహాయ రాక్షసులు మళ్ళీ మళ్ళీ సముద్రంలో దూకిపోయారు. అలసిపోయిన పరువదరాజా కూతురు పార్వతిని సాయం కోరాడు. మనసు దిగి నడిసముద్రంలో అగోర రూపంలో నిలబడి చేపలన్నీ మింగి నాశనమైన పార్వతి దేవి. అప్పుడు అనుకోకుండా సముద్రం కింద తపస్సు చేసిన మీనమకరిషి అనుకోకుండా ఒడ్డుకు వచ్చారు.తపస్సులో "నీ రాజసం నశించి చేపలు పట్టి బ్రతకాలి" అని శాపించిన పరువదరాజ. దీంతో అయిన పరువదరాజ పరిగెత్తుకుంటూ వెళ్లి శివుడిని వేడుకున్నాడు.


 కరుణాకటాక్షమైన శివా కార్తీగై రోజున తిరువన్నామలై లో జ్యోతిగా చూపిస్తా ఆ జ్యోతి లోడింగ్ చేసే పని పరువదరాజ కుటుంబం నెరవేర్చాలి. జ్యోతిని పూజించే కోట్లాది భక్తులు,అరోహరా అనే అరుపుల సకల పుణ్యం పర్వత కులానికి పోతుందని అన్నామ తిరువణ్ణామలై లో జ్యోతి వెలిగించే పనిని రుతుపవన రజకులతులు నిర్వర్తిస్తున్నారు.


ప్రస్తుతం అన్నామలైపై మహా దీపం వెలిగించే పని పూర్తి చేస్తున్న పర్వత రాజకుల సంప్రదాయంలోని ఆదియార్లు, తిరువన్నామలై తామరికులం ప్రాంతంలో నివసిస్తున్న 5వ వారజకుల కుటుంబాలు ఏటా మహా దీపం వెలిగించే పని చేస్తున్నట్లు తెలిపారు.దీపం వెలిగించడానికి 5 మంది ఎంపిక, (48 రోజులు) ఉపవాసం ఉంటారు. 


దీపాలు వెలిగించిన సేవకులకు అన్నామలైయార్ ఆలయంలో పరివట్టం నిర్మించబడును. అనంతరం అన్నామలైయార్ పుణ్యక్షేత్రం నుండి మట్టి పానలో మహా దీపం వెలిగించడానికి శివాచార్యులు భరణి దీపం మనకు అందజేస్తారు.మేళతాళం అంటూ కొండపైకి పంపే కార్యక్రమం ఉంటుంది. మట్టిలో మోసే దీపాన్ని ఆరిపోకుండా కొండ శిఖరానికి తీసుకెళ్దాం. కొండపై వేంచేసిన మహా దీప కొప్పరైలో నెయ్యి వేసి తిరుగుదాం. దానిపై, కర్పూర బంధాలను నెట్టేద్దాం.


సాయంత్రం 5.58 గంటలకు అర్థనారీశ్వర్ అన్నామలైయార్ ఆలయం వద్ద దర్శనమిస్తారు. ఈ  సాంప్రదాయం లో ఉన్నవారు గుడి జెండా చెట్టుకు వ్యతిరేకంగా దీపం వెలిగిస్తారు. ఆ తరువాత అన్నామలై పైన మహా దీపం వెలిగిస్తాం.మహా దీపం వెలిగించిన క్షణం దేవుడి పండుగ అనిపిస్తుంది. మన కళ్ళలో మరియు భావాల్లో దీపం మాత్రమే ఉంది. "మహా దీపం వెలిగించే జ్వాలమైన మేము శివాచార్యుల నుండి పర్వత ఎక్కే ముందు పాపప్రాయశ్చిత్తం కోసం ప్రార్ధించేవాళ్ళం. 


తిరువన్నామలై దేవుడు కాబట్టి కొండ ఎక్కడం పెద్ద పాపం. అందువల్ల కొండగట్టున గుహ నమశివాయార్ ఆలయం వద్ద అన్నామలైయార్ తిరుపదం ముందు 'లోకాన్ని రక్షించే ఏసాను నీ కార్యం నెరవేరడానికి కొండపై ప్రయాణిస్తున్నాము. పర్వతం మీదకు అనుమతించమని ప్రార్థించిన తరువాతే మా ప్రయాణం కొనసాగుతుంది.


దీపం వెలిగించేటప్పుడు శివ పురాణం పాడుతూ ఉంటుంది మన సంప్రదాయం. శివునికి తగిన గొలుసును జపిద్దాం. నిరంతరాయంగా మహా దీపం పర్వతం పై 11 రోజుల ప్రకాశవంతం మహా దీపం వెలిగించబడుతుంది. ప్రతిరోజూ అన్నామలైయార్ ఆలయం నుండి దీపం వెలిగించడానికి కర్పూరం  నెయ్యి  తీసుకువెళతాం. ఇదంతా అరునచలేశ్వరుడు మాకు ఇచ్చిన కృప .


అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా


11, డిసెంబర్ 2024, బుధవారం

శ్రీ భావనారాయన స్వామి ఆలయం : బాపట్ల...!!


 శ్రీ భావనారాయన స్వామి ఆలయం : బాపట్ల...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿శైవమునకు పంచారామక్షేత్రాలు ఉన్నట్టుగానే వైష్ణవమునకు కూడా పంచభావన్నారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవి 


🌹1) బాపట్ల (భావపురి), 


🌹2) పొన్నూరు (స్వర్ణపురి),


🌹3)  భావదేవరపల్లి (కృష్ణా జిల్లా), 


🌹4) సర్పవరం (నేడు కాకినాడలో అంతర్భాగం), పట్టిసం. 

వీనిలో ప్రకాశం జిల్లాలోని పెదగంజాం కూడా ఉంది అని చెప్తారు. 


🌹5) ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచ భావనారాయణ క్షేత్రాలలో ప్రధానమైన క్షేత్రం బాపట్లలో వెలసిన భావనారాయణ ఆలయం.


🌸ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్లగా, బాపట్లగా మారింది.


🌿ఇది ప్రాచీన ఆలయము. ఈ ఆలయము శాలివాహం శకం 515 లో (క్రీ.శ. 594 లో) ప్రమాదీ నామసంవత్సర ఫాల్గుణ శుద్ధ పూర్ణిమనాడు ప్రతిష్ఠింప బడినదని చరిత్రకారులు తెలియజేయుచున్నారు.


🌸కాని స్థలపురాణం మాత్రం, కృత, త్రేతా, ద్వాపర యుగాలలో ఇచట బ్రహ్మర్షులు సమావేశమగు చుండేవారని, వారచట ఒక యాగకుండమును ఏర్పాటు చేసి అచట నారాయణుని స్మరించుచూ హోమం చేయుచుండేవారని


 🌿అప్పుడు నారాయణుడు ఆయా యుగ ధర్మముననుసరించి, వేర్వేరు  రూపాలతో వారికి దర్శనమొసగుచుండే వాడని, ఆ ప్రకారం నారాయణుడు ద్వాపరయుగంలో క్షీరవృక్షంలో శేషరూపం ధరించి వారిని ఆశీర్వదించాడని, తరువాత వచ్చిన కలియుగంలో ఎవరును క్షీరవృక్షంలో ఉన్న నారాయణుని కనుగొనలేకపోయారనీ అంటారు.


 🌸కలియుగంలో కుళోత్తుంగచోలుడు దిగ్విజయ యాత్ర చేయుచూ ఈ ప్రాంతానికి వచ్చాడని, అపుడు వారి ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుచు క్షీరవృక్షము ఆకులు తినబోగా, వాని తొండములు ఆ చెట్టుకు అంటుకొనిపోయి రాలేదని, 


🌿రాజు ఆ వార్త విని అశ్చర్యం చెంది ఆ ప్రదేశానికి వచ్చి ఆ చెట్టును, ఆ చెట్టునంటుకొనిపోయి నిల్చుండియున్న ఏనుగులను చూచి, అది దైవమహిమయని గుర్తించి దైవాన్ని ప్రార్థించగా, 


🌸అతడు తన విషయాన్ని తెలియజేసి, మీ ఏనుగులు చేసిన పాపానికి పరిహారంగా మీరు ఇచట ఒక ఆలయము కట్టించుమని ఇరువురు బ్రాహ్మణుల ద్వారా తన భావాలను తెలియజేసిన నారాయణుని, భావనారాయణుడన్న పేరుతో ప్రతిష్టించి ఆరాధించాడని, అప్పటి నుండి ఆ ఆలయము భావనారాయణ ఆలయముగా ప్రసిద్ధిగాంచినది ఆ పురాణం వివరించుచున్నది.


🌿 ఇక్కడ భావన్నారాయణ స్వామి కాలి వేళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంటుంది. 

ఇలా ఓ దేవతామూర్తి భక్తుల కోసం ఎదురు చూడటం భారత దేశంలో మరెక్కడా కనిపించవు. 


🌸 ఈ ఆలయం లోపల చలికాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగా ఉంటుంది. 

ఇది అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం.


🌿ఆ ఆలయానికి రెండు ధ్వజస్థంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు గజపాద (ఏనుగు కాలు) ఆకారంలో ఉండటం విశేషం. ఆలయ గర్భగుడి వెనుక పై కప్పు మత్స్యం అంటే చేప ఆకారంలో కనిపిస్తుంది. దీన్ని తాకితే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. 


🌸 ఇదిలా ఉండగా భావనారాయణ స్వామి దేవాలయ నిర్మాణం జరిగే సమయంలో పునాదుల కోసం తవ్వుతుండగా అక్కడి వారికి జ్వాలా నరసింహ స్వామి విగ్రహం దొరికింది. దీంతో ఆ విగ్రహన్ని స్వామివారి విగ్రహం పక్కనే పెట్టి పూజించేవారు అయితే ఆ విగ్రహం అక్కడ పెట్టినప్పటి నుంచి దేవాలయానికి దగ్గరగా ఉన్న కారంచేడు అనే గ్రామం తరుచుగా అగ్నిప్రమాదాలు జరిగేవి. 


🌿ఈ విషయమై క్రిమకంఠ చోళుడు అక్కడి పురోహితులను సంప్రదించి పరిష్కారం చూపమని అడిగారు దీంతో పురోహితులు జ్వాలా నరసింహుడి ఉగ్ర రూపం వల్ల ఇక్కడ తరుచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఆయన్ను శాంతింప చేయాలని నిర్ణయించారు. 


🌸ఇందు కోసం స్వామివారి ఆలయానికి ఎదురుగా శాంత కేశవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఆ కారంచేడు గ్రామంలో అగ్నిప్రమాదాలు నిలిచిపోయాయని చెబుతారు. 


🌿 జ్వాలా నరసింహుడి విగ్రహం ఆసీన రీతిలో ఉంటుంది. నాలుగు చేతులు ఉంటాయి. పై రెండు చేతులతో శంఖం, చక్రం ఉండగా కింది కుడి చేయి అభయ హస్తం. ఎడమ చేయి తొడపై ఉంటుంది.


🌸 ఈ గ్రామంలో ఎనిమిది దిక్కుల్లో..

 వల్లాలమ్మ, 

కుంచలమ్మ, 

శంకరమ్మ, 

శింగరమ్మ, 

ధనకొండలమ్మ,

 మూలకారమ్మ,

 నాగభూషణమ్మ,

 బొబ్బలమ్మ అనే ఎనిమిది మంది గ్రామ దేవత శక్తులను ఎనిమిది దిక్కుల్లో ప్రతిష్టించారు. 


🌿 ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వేసవిలో జరిగే బ్రహ్మోత్సవాలకి లక్షల సంఖ్యల్లో భక్తులు వస్తుంటారు. ఇంకా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతుంది.


🌸ఈ దేవాలయంలో భావన్నారాయణుడు ఇతర పరివార దేవతలయిన శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవార్లు, ఆళ్వారులతో కొలువైవుండి భక్తుల ఇష్టదైవంగా వెలుగొందుతున్నాడు. 


🌿ముఖ్యంగా కేశవస్వామి ఎంతో సుందరంగా ఉండి భక్తులకు కనువిందు చేస్తాడు. ఇక్కడి శాంతకేశవ స్వామివారి మూలవిరాట్టును ఏమి కోరుకొంటే అది నెరవేరుతుందని చెబుతారు.


🌸దేశములోనే ఎక్కడాలేనట్టుగా విఖనస మునీంద్రులకు కూడా మందిరము ఉంది. అందుకే బాపట్ల మంచి విద్యాకేంద్రంగా వెలుగొందుతున్నదని చెప్తారు... స్వస్తి..🌞🙏🌹🎻


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

  తిరుమల  వేంకటేశ్వర స్వామి  ధృవబేరము 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరా...