CHITHRAGUPTHUDI TEMPLES IMPORTANCE
ఇక్కడ చిత్రగుప్తుడి ఆలయ దర్శనంతో అకాల మృత్యు భయం పోతుంది మనుష్యుల పాప పుణ్యాలను అనుసరించి వారికి శిక్ష విధించడం యమధర్మరాజు విధి అని మన పురాణాల్లో చెప్పబడిన విషయం తెలిసిందే. ఆ యముడికి భారత దేశంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. వీటిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఎందుకంటే యమధర్మరాజు ప్రాణాలు తీసే వాడని ప్రజలు నమ్ముతారు. ఆయన నుంచి ఎంత దూరం ఉంటే అంత మంచిదని భావిస్తుండటం వల్ల యమధర్మరాజుకు ఆలయాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో లేవు. ఇదిలా ఉండగా ఈ విశ్వంలో కోట్లాది జీవుల పాపపుణ్యాలను యమధర్మరాజు ఒక్కడే లెక్కగట్టలేడు కదా. ఆయనకు ఈ విషయంలో సహకారం అందించడానికి ఉన్న వ్యక్తి చిత్రగుప్తుడు. ఈయనకు కూడా భారత దేశంలో అక్కడడక్కడా ఆలయాలు కనిపిస్తాయి. ఆ ఆలయాల దర్శనం వల్ల ఆకాల మృత్యు భయం పోతుందని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో గరుడ పురాణంలోని చిత్రగుప్తుడి జననంతో పాటు ఆయన ఆలయాల గురించి కథనం మీ కోసం ఈ విశ్వం ప్రారంభం తర్వాత భూలోకంలోని జీవులు చనిపోయినప్పుడు వారి ఆత్మలు స్వర్గానికి లేదా నరకానికి వెళ్లేవి. ఇలా వెళ్లిన ఆత్మల పాపాలను నిర్ణయించడంలో యమధర్మరాజు కొంత గందరగోళానికి గురయ్యేవాడు. ఎందు కంటే ఎవరు ఎంత పాపం చేసింది ...