Rajahmundry లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rajahmundry లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, డిసెంబర్ 2024, శుక్రవారం

కోనసీమ ! మూడు వైపులా నీరు మధ్యలో గోదావరి డెల్టా ప్రాంతం

 

కోనసీమ



కోనసీమ ! మూడు వైపులా నీరు మధ్యలో గోదావరి డెల్టా ప్రాంతం !


కోనసీమ డెల్టా చుట్టూ, రెండు వైపులా గోదావరి పాయలైన వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి, గౌతమి, నీలరేవు వున్నాయి. ఒక ప్రక్క సముద్రం ఉంది, రాజమండ్రి నగరాన్ని దాటిన తరువాత గోదావరి వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి పాయలుగా చీలుతుంది. వృద్ధ గోదావరి గౌతమి, నీలరేవుగా, వశిష్ట గోదావరి వశిష్ట, వైనతేయ గా చీలుతుంది. ఈ పాయలు బంగాళాఖాతం తీరంలో170 కి.మీ పొడవైన పరివాహక ప్రదేశాన్ని ఏర్పరుస్తాయి. దీనినే కోనసీమ ప్రాంతం అంటారు.


కోనసీమలో అమలాపురం అతి పెద్ద పట్టణం. దీని తరువాత స్థాయిలో రాజోలు, రావులపాలెం, కొత్తపేట, ముమ్మిడివరం వున్నాయి.


ఆంధ్రా పాలిట భూతలస్వర్గం ... 'కోనసీమ' ! కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం.


కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. పచ్చని తీవాచీ పరిచినట్లుంటే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశిష్టంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది.


 కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి.


 ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం. 


కోనసీమలో ఉన్న ప్రధాన ప్రదేశాలు అమలాపురం, రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం,ముక్తేశ్వరం, కొత్తపేట అంబాజీపేట. రాజమండ్రి కోనసీమకు పక్కనే పెద్ద నగరం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోనసీమ అందాలను, ఇక ఆలస్యం చేయకుండా కోనసీమ అందాలు తెలుసుకొందామా ..!


కోనసీమ అందాలు

మాటలకందని అనుభూతులు, రహదారుల వెంట కాలువలు ,పచ్చని చెట్ల తోరణాలు ,అరటి గెలలు, కొబ్బరి తోటలు , మంచు తెరలు మనోహర దృశ్యాలు, రంగవల్లులు కోడిపందాలు ,అంతర్వేదిలో గోదావరి సాగరసంగమంలో పడవ ప్రయాణం మరపురాని ఒక మధురానుభవం. పచ్చని పంట పొలాలు... ఆకాశాన్ని తాకేలా పెరిగిన కొబ్బరిచెట్లు...పుష్కలమైన ప్రకృతివనరులు. కనుచూపు మేరకు తనివితీరని రమణీయమైన ప్రకృతి సౌందర్యం. ఇవన్నీ కోనసీమ అందాలు.


పంటపొలాలు

కోనసీమలో పండించని పంట ఉండదు. కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.


సంస్కృతి - సంప్రదాయాలు - పండుగలు


కోనసీమ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ - సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిధి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. తెలుగు సంవత్సరాది ఉగాది, సంక్రాంతి కోనసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగలు.


పలకరింపులు

కోనసీమ పలకరింపులు భలేగా ఉన్నాయి. చాలా సినిమాలలో అబ్సర్వ్ చెసింటారనుకోండి ..! 


ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. సంప్రదాయ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే కోనసీమ రాక తప్పదు. ఎవరు కనబడినా ఆప్యాయంగా పలకరించడం వారి సంస్కారం. ఎలా ఉన్నారో.. ఏం చేస్తున్నారో అని అడిగి తెలుసుకోవడం వారికి పుట్టుకతో వచ్చిన గుణం. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందర్నీ గౌరవంగా, ఆప్యాయంగా పలకరించే సంస్కారం వారి సొంతం


దేవాలయాలు


కోనసీమ ప్రాంతంలో పర్యాటకులు ఎన్నో దేవాలయాలను చూడవచ్చు. వాటిలో ప్రధానమైనవి 

1.మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి 

2.ర్యాలీ లో గల జగన్మోహిని కేశవ స్వామి గుడి

3. ముక్తేశ్వరం లోని క్షణ ముక్తేశ్వరాలయం 

4.పలివెల లోని శ్రీ ఉమాకొప్పు లింగేశ్వర ఆలయం 

5.మందపల్లి లోని శనీశ్వర ఆలయం

6.అయినవిల్లిలోని విఘ్నేశ్వరస్వామి దేవాలయం

7. రాజోలు పట్టణ సమీపములో బి.సావరం(కస్తూరి వారి సావరం)

ఉమా సోమేశ్వర స్వామి క్షేత్రం 


ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి


రావులపాలెం

రావులపాలెం కోనసీమ అరటిపండ్ల మార్కెట్ కి ప్రధాన కేంద్రం. దీనిని కోనసీమకు ముఖద్వారం అని పిలుస్తారు.


అమలాపురం

అమలాపురం కోనసీమలో ప్రస్తుతం కోనసీమ జిల్లా కేంద్రం 


కాకినాడకు 65 కి. మీ ల దూరంలో కలదు . అమలేశ్వరస్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, అయ్యప్పస్వామి, షిర్డీ సాయి స్వర్ణ మందిరం చూడదగ్గవిగా ఉన్నాయి.


కోనసీమ వంటలు

కోనసీమ వంటలు ఆహా ..! అనిపించకమానవు.  అట్లు, మినపట్టు,పెసరెట్టు టిఫిన్ కు బాగుంటాయి. మధ్యాహ్నం లంచ్ కి పిక్కల్(చట్నీలు) లేకుండా ఇక్కడి వారి భోజనం పూర్తికాదు. ఇక్కడికి వెళితే పూతరేకులు తప్పక తినండి.


గోదావరి అందాలు

గోదావరి నది పై వంతెనలు నిర్మించక ముందు ప్రజారవాణా అంతాకూడా లాంచీలు, పడవల మీదుగానే సాగిపోయేవి. ఇప్పటికీ వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. గోదావరి నదిలో సుమారు 10-20 నిమిషాల లాంచీ ప్రయాణం (కోనసీమ పరిసర ప్రాంతాలలో .. ) పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.


పాపికొండల ప్రయాణం

కోనసీమ నుండి పాపికొండల ప్రయాణం అనుభూతి వర్ణించలేనిది. బిజీ లైఫ్ నుండి రిలీఫ్ కాలావనుకొనేవారికి ఈ ప్రయాణం అనుకూలం.


కోనసీమ పర్యాటకం

కోనసీమ పర్యాటకం పర్యాటకులను ఆకర్శించటానికి ఎన్నోయాత్రలను అందిస్తున్నది. పాపికొండలు, మారేడుమిల్లి, మంగ్రోవ్ ఫారెస్ట్ ఇక్కడి సమీప అందాలు.ఇక్కడికి వెళ్ళటానికి టూర్ ప్యాకేజీలను, వసతి కై రిసార్ట్ లు అనేకం కలవు.


సినిమా షూటింగ్లు

కోనసీమ సినిమా షూటింగ్ లకు పెట్టింది పేరు. ఇప్పటివరకు ఇక్కడ ఎన్నో టాలీవూడ్ సినిమా లు చిత్రీకరించారు.


కోనసీమ చేరుకోవటం ఎలా ?

వాయు మార్గం : కోనసీమ చేరుకోవటానికి సమీపాన రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కలదు.

రైలు మార్గం : కోనసీమ పరిసరాల్లో రాజమండ్రి, కాకినాడ, కోటిపల్లి, గంగవరం, పాలకొల్లు, నరసాపూర్ రైల్వే స్టేషన్ లు కలవు.


బస్సు / రోడ్డు మార్గం : హైదరాబాద్ నుండి కోనసీమలోని ప్రతి నగరానికీ బస్సు సర్వీసులు కలవు.


 రాజమండ్రి కోనసీమకు ప్రక్కనే కల పెద్ద నగరం. 

రాజమండ్రి కి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి బస్సు సౌకర్యం కలదు. అక్కడి నుండి కోనసీమప్రాంతాలకు ఆర్డినరీ బస్సు సర్వీసుల ద్వారా చేరుకోవచ్చు.


Credits : DrAyodhya Sarma Kasturi 

19, డిసెంబర్ 2024, గురువారం

ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించాల్సిన 20 అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలు

 


ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించాల్సిన 20 అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలు
ఆంధ్రప్రదేశ్, సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి సౌందర్యం, మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం, పర్యాటకులకు విస్తృత స్థలాలను అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో తప్పనిసరిగా సందర్శించాల్సిన 20 ప్రదేశాలు ఉన్నాయి:
1. తిరుపతి
ప్రత్యేకతలు:
• ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించబడే యాత్రాకేంద్రమైన తిరుమల వెంకటేశ్వర దేవాలయం ఇక్కడే ఉంది.
• ఇతర ఆకర్షణలు: కపిల తీర్థం, చంద్రగిరి కోట.
2. అరకు వ్యాలీ
ప్రత్యేకతలు:
• ఆకట్టుకునే పచ్చటి పర్వత ప్రాంతం, కాఫీ తోటలు, గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి.
• బొర్రా గుహలు, కటికీ జలపాతాలు, గిరిజన మ్యూజియం చూడదగినవి.
3. విశాఖపట్నం (విజాగ్)
ప్రత్యేకతలు:
• ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ వంటి బీచ్‌లతో ప్రసిద్ధమైన తీర నగరం.
• ఆకర్షణలు: కైలాసగిరి, INS కురుసురా సబ్‌మెరైన్ మ్యూజియం, సింహాచలం దేవాలయం.
4. విజయవాడ
ప్రత్యేకతలు:
• “విజయనగరం”గా పిలువబడే ఈ నగరంలో కనకదుర్గ దేవాలయం, ప్రకాశం బ్యారేజ్ ప్రసిద్ధి.
• భవానీ దీవి, కొండపల్లి కోట సందర్శించవచ్చు.
5. అమరావతి
ప్రత్యేకతలు:
• బౌద్ధ స్మారకమైన అమరావతి స్తూపం చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది.
• ఆధునిక రాజధాని ప్రాజెక్టులు, శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవాలయం చూడవచ్చు.
6. లేపాక్షి
ప్రత్యేకతలు:
• పురాతన వీరభద్ర స్వామి దేవాలయం, తేలియాడే స్తంభంతో ప్రసిద్ధి.
• మహా నంది విగ్రహం, గంపలు నిక్షిప్త కవచాల కళాఖండాలు.
7. గండికోట
ప్రత్యేకతలు:
• కడప జిల్లాలో గల “భారత గ్రాండ్ కేనియన్” అందమైన నది గుండాలు.
• గండికోట కోట, పెన్నా నది దృశ్యాలు చూడవచ్చు.
8. శ్రీకాళహస్తి
ప్రత్యేకతలు:
• శ్రీకాళహస్తీశ్వర దేవాలయం, శివునికి అంకితమైనది.
• ఆధ్యాత్మిక, శిల్పకళా వైభవం ప్రసిద్ధం.
9. బెలుం గుహలు
ప్రత్యేకతలు:
• నంద్యాల జిల్లాలో ఉన్న భారతదేశంలో రెండవ అతిపెద్ద గుహల సముదాయం.
• అద్భుతమైన ప్రాకృతిక శిలాశిల్పాలు చూడవచ్చు.
10. కర్నూలు
ప్రత్యేకతలు:
• రాయలసీమకు గేట్వే. అహోబిలం ఆలయం, కొండా రెడ్డి కోట, ఒర్వకల్ రాక్ గార్డెన్ చూడవచ్చు.
11. రాజమండ్రి
ప్రత్యేకతలు:
• ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని, గోదావరి నదితో అనుసంధానం.
• గోదావరి బ్రిడ్జ్, డౌలేశ్వరం బ్యారేజ్, పాపి కొండలు సందర్శించవచ్చు.
12. కోనసీమ
ప్రత్యేకతలు:
• పచ్చని కొబ్బరి తోటలు, ప్రశాంతమైన బ్యాక్ వాటర్‌లతో ప్రకృతి అందాల సమాహారం.
• హౌస్ బోట్ అనుభవం ప్రత్యేకం.
13. అనంతపురం
ప్రత్యేకతలు:
• లేపాక్షి ఆలయం, పెనుకొండ కోట, మరియు ప్రపంచంలోనే పెద్ద బనియన్ చెట్టు తిమ్మమ్మ మర్రి మాను.
14. నాగార్జునకొండ
ప్రత్యేకతలు:
• కృష్ణా నది మధ్యనున్న ద్వీపం, బౌద్ధ ధాతువులు, పురావస్తు మ్యూజియంతో ప్రసిద్ధి.
15. హార్స్లీ హిల్స్
ప్రత్యేకతలు:
• హాయిగా వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు.
• ట్రెక్కింగ్, నేచర్ వాక్స్ కోసం ప్రసిద్ధి.
16. కడప
ప్రత్యేకతలు:
• గండికోట కోట, అమీన్ పీర్ దర్గా, పుష్పగిరి ఆలయాలు ప్రసిద్ధి.
17. మహానంది (నంద్యాల జిల్లా)
ప్రత్యేకతలు:
• ప్రాచీన మహానందీశ్వర స్వామి ఆలయం, పవిత్ర జలకుండాలు ప్రసిద్ధి.
18. మచిలీపట్నం
ప్రత్యేకతలు:
• బీచ్‌లు, చారిత్రక బందర కోట ప్రసిద్ధి.
• కలంకారి కళ, వస్రాలు ప్రత్యేకం.
19. పుట్టపర్తి
ప్రత్యేకతలు:
• శ్రీ సత్యసాయి బాబా జన్మస్థలం, ప్రసాంతి నిలయం ఆశ్రమం.
• ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రసిద్ధి.
20. నాగార్జున సాగర్
ప్రత్యేకతలు:
• భారతదేశంలోనే అతిపెద్ద డ్యామ్‌లలో ఒకటి.
• ఏతిపోతల జలపాతాలు, నాగార్జునకొండ ద్వీపం చూడవచ్చు.
ప్రయాణ సూచనలు:
• సందర్శనానికి ఉత్తమ సమయం: అక్టోబర్ నుండి మార్చి.
• సాంస్కృతిక కార్యక్రమాలు: సంక్రాంతి, ఉగాది, తిరుపతి బ్రహ్మోత్సవం కోల్పోవద్దు.
• స్థానిక వంటకాలు: ఆంధ్ర భోజనాలు, గోంగూర పచ్చడి, పెసరట్టు తప్పక రుచించండి.

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

  తిరుమల  వేంకటేశ్వర స్వామి  ధృవబేరము 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరా...