Temple లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Temple లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, డిసెంబర్ 2024, శనివారం

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

 



తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం.


🌿ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. ఈ మూర్తి స్వయంభూమూర్తి (అనగా స్వయంగా వెలసినది, ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు) అని భక్తుల విశ్వాసం.



🌸మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. 


🌿మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు.


🌸నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.


🌿18 అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు. గురువారం సాయంకాలం, మరియు శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక, స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి


🌸ధృవబేరం చక్కని ముఖకవళికలతో వెలసి ఉంటుంది. ముక్కు మరీ ఎత్తూ కాదు, చప్పిడీ కాదు. కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి. నుదుటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంది.


🌿నిత్యం పచ్చకర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంతభాగం కప్పివేస్తుంది. నామం రూపం, సైజూ వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పినవిధంగా కచ్చితంగా పాటిస్తారు. 


🌸స్వామివారి శిరస్సుపై (నుదుటిపైభాగం వరకు) కిరీటం ఉంది. ఆయన జటాజూటము భుజాలపై పడుతూ ఉంటుంది. 


🌿కచ్చితమైన కొలతలు తీసికొనబడనప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు సుమారు 36-40 అంగుళాల మధ్య సైజులోనూ, నడుము భాగం వెడల్పు 24-27 అంగుళాలు సైజులోనూ ఉంటుంది. 


🌸స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది. ఆయన వక్షస్థలం కుడిభాగాన శ్రీలక్ష్మీదేవి రూపం ఉంది.


🌿స్వామివారు చతుర్భుజములను కలిగియున్నారు. పై కెత్తిన కుడిచేతిలోనున్న సుదర్శన చక్రము, ఎడమచేతిలోనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. 


🌸అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు. దిగువనున్న రెండుచేతులలోను కుడిచేయి వరదహస్తము (అరచేయి భక్తులకు కనిపిస్తూ, వరములను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది).


🌿ఎడమచేయి కట్యావలంబిత ముద్రలో (నడుమువద్ద మడచినచేయి. అరచేయి స్వామివారివైపు ఉంటుంది) ఉంది. నడుము క్రిందభాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు.


🌸రెండు మోకాళ్ళూ కొంచెంగా వంగినట్లు కనిపిస్తాయి (స్వామివారు భక్తుల రక్షణకు నడచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా). 


🌿స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్బాణాల ముద్రలున్నాయి.. సేకరణ... స్వస్తి...🚩🌞🙏🌹🎻

ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'!

 



ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'!


శ్రీ కృష్ణుని ఆలయాలలో, నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. 

ఇవి ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ లోని మథుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి. 

ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం, కర్ణాటకలోని ఉడుపితో ముడిపడి ఉంది. 

ఒక రోజు శ్రీ మధ్వాచార్యుల వారు, వేకువజామునే, సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి, ప్రాత: సంధ్యాదికాలు ముగించుకుని, ఆ తీరంలోనే కూర్చుని, ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో, ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. 

ఆ రోజు పర్వదినం కావడంతో, అనేక మంది ప్రజలు కూడా వచ్చి, సముద్రస్నానం చేశారు.

ప్రశాంతమైన ప్రాత: కాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం. 

అలాంటి నేపద్యంలో, శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా, ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు. 

ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో, ద్వారక నుండి సరుకులు తీసుకువస్తోన్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా, అకస్మాత్తుగా, విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి. ఈ గాలులకు సముద్ర కెరటాలు, ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. 

నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దానిని రక్షించుకోవడానికి, అందులోని నావికులు చేస్తోన్న ప్రయత్నాలు, ఫలించడం లేదు. క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది. ఏ క్షణాన్నైనా, నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. 

నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో, చివరి ప్రయత్నంగా, నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను, తీరం వైపు చూస్తూ, రక్షించేవారి కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. 

అంత దూరం నుంచి కూడా, ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు, ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయననుద్దేశించి, మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు.

 ద్వాదశ స్తోత్ర రచనలలో లీనమై ఉన్నప్పటికీ, అంతటి హోరుగాలిలోనూ అంత దూరంనుంచి వ్యాపారి చేస్తోన్న ప్రార్థన, మధ్వాచార్యుల చెవిని తాకింది. 

అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం, ఒక కొసను పట్టుకుని గాలిలో నావ కేసి విసిరి, వెనక్కు తీసుకున్నారు. అంతే, ఆ క్షణం వరకూ సముద్రంలో మునిగిపోతుందా? అన్నట్లున్న నౌక, ఒక్కసారిగా స్థబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా, తీరానికి చేరి స్థిరంగా నిలిచింది.

 నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకు మునువు ప్రార్థన చేసిన వ్యాపారి, వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి, సాష్టాంగ నమస్కారం చేశాడు. 

అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరం లేచి నిలబడి, అంజలి ఘటించి, ‘స్వామీ, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. 

వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి’. అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు. 

మధ్యాచార్యుల వారు చిరునవ్వు నవ్వి, చివరకి అతని కోరికను మన్నించారు. అయితే, ‘నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు, నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు, ఈయగలవా’ అన్నారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, గోపీచందనం, ద్వారకలో ఎక్కడపడితే అక్కడ దొరికే మట్టి. 

పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడూ, దించేటప్పుడూ, బరువు సమతూకం తప్పిపోకుండా, గోపీ చందనపు గడ్డల సహాయంతో, నౌకలో సరుకును అటూ ఇటూ సర్దుతూ ఉంటారు. 

అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు, ఈ మహానుభావుడు కోరడం, ఆ వ్యాపారికి సుతరామూ నచ్చలేదు. 

ఎంత ప్రార్థించినప్పటికీ, మధ్వాచార్యుల వారు, తాను కోరిన గోపీ చందనానికి మించి, మరే బహుమతినీ తీసుకోవడానికి అంగీకరించలేదు. 

చివరికి ఆ వ్యాపారి, స్వామి కోరిన ఆ గోపీ చందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి, అవే కోరడంలోని పరమార్థం ఏమిటో, ఆ మట్టి గడ్డల మహిమ, విశేషాలేమిటో, కనీసం అవైనా తెలుపమని, ప్రార్థించాడు. 

స్వామి మళ్లీ చిరునవ్వు చిందిస్తూ, ‘నువ్వే చూడు’ అంటూ, ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే, నీటితో కరిగించారు. 

ఆ సమయంలో, అక్కడ ఓ అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం, రెండవ దాని నుండి శ్రీ కృష్ణుని విగ్రహం బయటపడ్డాయి.

 అక్కడున్నవారందరూ, సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. 

శ్రీ కృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే, మధ్వాచార్యులు, ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో, దశావతారాన్ని వర్ణించారు. 

బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, శ్రీ కృష్ణుని విగ్రహం తీసుకుని, ఉడుపీకి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత, ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు.

అందుకే, ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. అమృతరూపమైనటువంటి శ్రీ కృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. 

ఇంతకీ శ్రీ కృష్ణుని విగ్రహ రహస్యం ఏంటి? వాస్తవానికి జరిగిందేంటి? అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. 

ఆ శ్రీకృష్ణుని విగ్రహం, సామాన్యమైనదికాదు. 

ఒకసారి దేవకీదేవి, ‘కృష్ణా.. నీ బాల్య లీలలు చూసే భాగ్యం, యశోదకు కలిగినట్లు నాకు కలుగలేదు. 

వాటి గురించి వినీ, వినీ, ఎప్పటికైనా చూడాలని, నా మనస్సు ఉవ్విళూరుతోంది. చూపించవా కృష్ణా’ అని ప్రార్థించింది. కృష్ణుడు అనుగ్రహించాడు.

 మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు. తప్పటగులు వేస్తూ నడిచాడు. దేవకీ దేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని త్రాగాడు. 

కేరింతలు కొట్టాడు. కుండ పగులగొట్టి వెన్న తిన్నాడు. ఒంటినిండా రాసుకున్నాడు. 

పామును తాడులాగా పట్టుకుని, మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా, తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు. 

ఈ చేష్టలను చూసి దేవకీ దేవి పరవశించి, మైమరచిపోగా, ఇదంతా గమనిస్తున్న రుక్మిణీ, తన పతి దేవుని శైశవ రూపాన్ని, ప్రపంచమంతా చూసి తరించాలని భావించి, వెంటనే విశ్వకర్మను పిలిపించి, ఆయా రూపాల్లో, శైశవ కృష్ణుడూ, బలరాముని విగ్రహాలను చేయించింది.


ముందుగా తానే, సకల వైభవాలతో, విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది.


మరికొంత కాలానికి, ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం, ఆసన్నమైంది. దూరదృష్టితో అర్జునుడు, ఆ విగ్రహాలను తీసుకువెళ్లి, ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి, దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు. కాలక్రమంలో, ఆ వనం యావత్తూ, గోపీ చందనం మట్టిలో కలిసి, కనుమరుగైపోయింది.


నావికులు తమ నౌకల్లో, సమతూకాన్ని పాటించడం కోసం, గోపీ చందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం, కాకతాళీయంగా, ఈ విగ్రహాలున్న గోపీ చందనం గడ్డల్ని కూడా, నౌకలోకి చేర్చారు. 

వాటి విలువ తెలియకుండానే, వాటిని తీసుకెళ్లే భాగ్యం, ఆ వ్యాపారికి లభించింది. ఆ విగ్రహం, ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యులవారి దివ్య దృష్టికి ముందే తెలుసు.


ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ, ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే, ఆయన ఆరోజు, ఆ తీరానికి వెళ్లారు. శ్రీ కృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు, తమ శిష్యుల చేత, మాధవ సరోవరంలో, ప్రక్షాళన చేయించారు. 

తరువాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు, నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం, మధ్వాచార్యుల వారు అభిషేకించిన తరువాత, 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు. 

ఎందుకంటే, మధ్వాచార్యుల అభిషేకంతో, ఆ విగ్రహంలో, శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడింది. 

మంత్ర విధులతో, మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోకంగా, శ్రీ కృష్ణ విగ్రహాన్ని, విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ నాడు, సామాన్య శకం, 1236 వ సంవత్సరంలో, ఉడుపిలో ప్రతిష్ఠింపజేశారు. ఆనాటి నుంచి, ఉడుపి ప్రాంత యాజ్ఞికులందరూ, శ్రీ మధ్వాచార్యులవారు అవలంభించిన విధానాలనే, అనుసరిస్తున్నారు.

 శ్రీ కృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా, తన 8 మంది శిష్యులచే నిర్వహింపబడేటట్లుగా, పెజావరు మఠం, పుట్టిగే, పాలిమరు, ఆడమారు, సోదే, కాణియూరు, శిరూరు, కృష్ణ పురా అనే ఎనిమిది మఠాలను, శ్రీ మధ్వాచార్యులు ఏర్పరచారు. 

వీటిని అష్టపీఠాలు అంటారు. ఇవన్నీ, ఉడుపి కేంద్రంగా, శ్రీ కృష్ణ మఠానికి చుట్టు ప్రక్కల ఉన్నాయి.

శ్రీ మధ్వాచార్యులు శ్రీకృష్ణుని మఠంలో పూజించడం ప్రారంభించారు మరియు అష్ట మఠాల (ఎనిమిది మఠాలు) స్వామీజీ ద్వారా శ్రీకృష్ణుని పూజించే "పర్యాయ" విధానాన్ని ప్రారంభించారు. విగ్రహాన్ని తాకి పూజించే హక్కు శ్రీ మధ్వాచార్యుల ఆధ్యాత్మిక వారసులైన ఎనిమిది మఠాల పీఠాధిపతులపై ఉంటుంది. ఎనిమిది మఠాలకు చెందిన స్వామీజీలు ఒక్కొక్కరు రెండేళ్లపాటు శ్రీకృష్ణ మఠంలో పూజలు నిర్వహిస్తారు. భ్రమణం ద్వారా చేసే ఈ కాలాన్ని "పర్యాయ" అంటారు. ఏ సమయంలోనైనా ఆరాధనకు బాధ్యత వహించే స్వామీజీని 'పర్యాయ స్వామీజీ' అని పిలుస్తారు మరియు అతని మఠాన్ని 'పర్యాయ మఠం' అని పిలుస్తారు. ఎనిమిది పర్యాయ మఠాలు సోడే మఠం, పెజ్వర్ మఠం, పుట్టిగే మఠం, అద్మార్ మఠం, కనియూర్ మఠం, పలిమారు మఠం, షిరూర్ మఠం మరియు కృష్ణపుర మఠం. ప్రస్తుత పర్యాయ స్వామీజీ శ్రీ సోధే మఠానికి చెందిన “శ్రీ విశ్వవల్లభ తీర్థ స్వామీజీ”.

ఉడిపిలో చంద్రమౌళీశ్వర మరియు అనాథేశ్వర ఆలయాలు అనే రెండు పురాతన ఆలయాలు ఉన్నాయి. శివుడు లింగ రూపంలో కనిపించి వెండి పీఠాన్ని ఆక్రమించి ఇక్కడ అనంతేశ్వరుడిగా ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. శాపం నుండి విముక్తి కోసం చంద్రుడు 'చంద్ర పుష్కరిణి' అనే పవిత్ర చెరువు ఒడ్డున ఉన్న శివుడిని పూజించాడు. అతని పూజలకు శివుడు సంతోషించి చంద్రునికి ప్రత్యక్షమై శాపవిమోచనం చేసాడు.అందుకే శివుడిని చంద్రమౌళీశ్వరుడు అని పిలుస్తారు మరియు ఈ ప్రదేశంలో చంద్రమౌళీశ్వర ఆలయంగా ప్రసిద్ది చెందింది. పురాతన కాలంలో ఉడిపిని శివల్లి లేదా శివ-బెల్లి లేదా రజతపీఠ పుర అని పిలిచేవారు. పరశురాముని యొక్క గొప్ప భక్తుడైన రామభోజుడు పరశురామ క్షేత్రానికి రాజుగా ప్రకటించబడినందున ఈ ప్రదేశం రజతపీఠ పుటగా పిలువబడింది. మహాయజ్ఞం చేయాలనే ఉద్దేశ్యంతో యజ్ఞస్థలం దున్నుతుండగా ఒక పాము చంపబడింది.సర్ప దోషం (పామును చంపిన పాపం) నుండి తనను తాను విముక్తి చేసుకోవడానికి, దానిపై పాము చిత్రాలతో చెక్కబడిన వెండి పీఠాన్ని (రజత పీఠం) తయారు చేయమని రామబోజ రాజును పరశురాముడు ఆదేశించాడు.దక్ష ప్రజాపతి శాపం నుండి విముక్తి కోసం శివుడిని తపస్సు చేసిన చంద్రుడు చంద్రుడి పేరు మీద రాజతపీఠ పురా అని పేరు పెట్టారు..సంస్కృతంలో ఉడు అంటే `నక్షత్రం’ మరియు ప అంటే `నాయకుడు’. చంద్రుడు నక్షత్రాలకు అధిపతి కావడంతో ఆ ప్రాంతానికి `ఉడిపి` అని పేరు వచ్చింది.


ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం విశేషాలు

  • కనకన కిండి: కృష్ణ దర్శనం నవగ్రహ కిండి ద్వారా జరుగుతుంది, కిండి వెనుక ఉన్న పురాణం 16వ శతాబ్దపు కనకదాసు మరియు శ్రీ కృష్ణుని శిష్యుడు శ్రీకృష్ణుని ఆరాధించడానికి ఉడిపికి వచ్చాడు. కానీ అతను తక్కువ కులానికి చెందినవాడు కాబట్టి మఠం లోపలికి అనుమతించబడలేదు మరియు అతను దొంగతనానికి పాల్పడ్డాడని భావించి మఠం వెనుక ఉన్న స్తంభానికి కట్టివేయబడింది. కనకదాసు ఆరాధనకు సంతసించిన శ్రీకృష్ణుడు మఠం వెనుక గోడకు చిన్న రంధ్రం చేసి కనకదాసుకు దర్శనమిచ్చి, కనకదాసుకు కనిపించేలా రంధ్రం వైపుకు తిప్పాడు. ఈ రంధ్రాన్ని కనకన కింది అని పిలుస్తారు.


  • ఆలయ స్వర్ణ రథాన్ని సందర్శకులు చూడవచ్చు.
  • ఉడిపి పర్యాయ ఉత్సవ రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ప్రసిద్ధ పండుగ. పర్యాయ ఉత్సవ ఉడిపిలోని 8 మఠాలలో ఆలయ నిర్వహణను ఒక మఠం నుండి మరొక మఠానికి అప్పగించడాన్ని సూచిస్తుంది.
  • అన్నదాన: శ్రీకృష్ణ దేవాలయం ప్రతి భక్తునికి ఉచిత భోజనాన్ని అందిస్తుంది
  • గోశాల (ఆవు షెడ్)
  • ఆలయ రథం (బ్రహ్మ రథం)

దర్శన సమయాలు ఉడిపి శ్రీ కృష్ణ దేవాలయం అన్ని రోజులలో ఉదయం 4.30 నుండి రాత్రి 9.30 వరకు తెరిచి ఉంటుంది

సమీపంలో: మాల్పే, కాపు బీచ్, సెయింట్ మేరీస్ ద్వీపం ఉడిపి పట్టణానికి 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొన్ని ఆకర్షణలు.

ఎలా చేరుకోవాలి: ఉడిపి బెంగళూరు నుండి 400 కి.మీ. మంగళూరు సమీప విమానాశ్రయం (60 కి.మీ.). ఉడిపి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులతో రైలు మరియు రోడ్డు నెట్‌వర్క్ ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. శ్రీ కృష్ణ దేవాలయం ఉడిపి సిటీ సెంటర్ నుండి నడక దూరంలో ఉంది.

బస: ఉడిపి పట్టణంలో అనేక లగ్జరీ మరియు బడ్జెట్ వసతి అందుబాటులో ఉన్నాయి.






26, డిసెంబర్ 2024, గురువారం

స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం

 

స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం



ఆలయం గురించి

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం చిత్తూరు జిల్లా కాణిపాకం గ్రామంలో ఉంది. ఈ పురాతన గణేశ దేవాలయాన్ని కాణిపాకం వినాయక దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభూ, స్వయంభువు. ఈ ఆలయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రీ వినాయక విగ్రహం పరిమాణం రోజురోజుకు పెరుగుతోంది. కలియుగం ముగిసే వరకు ఈ విగ్రహం పరిమాణం పెరుగుతుందని, ఆపై శ్రీ వినాయకుడు ప్రత్యక్షమవుతాడని నమ్ముతారు. శ్రీ వరసిద్ధి వినాయకుడు వెలిసిన బావి ఇప్పటికీ ఆలయంలో ఉంది. ఈ ఆలయంలో బావిలోని పవిత్ర జలాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. 11వ శతాబ్దం CE ప్రారంభంలో చోళ రాజు కులోత్తుంగ చోళుడు-I చేత నిర్మించబడిన ఈ ఆలయం 1000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనదిగా నమ్ముతారు. ప్రస్తుత కాణిపాకం గ్రామం పూర్వకాలంలో "విహారపురి" అని పిలువబడేది.

"కాని" అంటే ఒక వంతు భూమి మరియు "పాకం" అంటే భూమిలోకి నీరు వెళ్లింది అంటే నీటిపారుదల. దీని యొక్క సూచన కణిపారకంగా గుర్తించబడింది - చివరికి కాణిపాకం అని పిలుస్తుంది, ఇది తమిళ ట్రాన్సెండెడ్ (ఉత్పన్నమైన) పదం.

పురాతన ఆలయ పురాణాల ప్రకారం, ముగ్గురు సోదరులు ఉన్నారు మరియు వారిలో ప్రతి ఒక్కరికి ఒక వైకల్యం ఉంది. ఒకరోజు, వారు నీటి కోసం బావిని త్రవ్వడం ప్రారంభించారు మరియు అకస్మాత్తుగా ఇనుప పరికరం ఒక రాయిని ఢీకొంది. ఆ తర్వాత బావిలోంచి రక్తం కారడం చూసి బావిలోని నీరంతా ఎర్రగా మారిపోయింది. ఈ దివ్య దర్శనం చూసి వారు తమ వైకల్యాలను వదిలించుకున్నారు. ఈ అద్భుతం గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే బావిని మరింత లోతుగా చేసేందుకు ప్రయత్నించారు.

 శ్రీ వరసిద్ది వినాయకుని "స్వయంభూ" విగ్రహం బావి నుండి ఉద్భవించింది. తరువాత, ప్రజలు బావి చుట్టూ ఆలయాన్ని నిర్మించారు. నేటికీ అదే బావిలో విగ్రహం ఉంది మరియు బావిలోని ఊటలు శాశ్వతంగా వస్తూ వున్నాయి. వర్షాకాలంలో బావి నుండి పవిత్ర జలం పొంగి ప్రవహిస్తుంది. విగ్రహం యొక్క మరొక విచిత్రం ఏమిటంటే ఇది ఇప్పటికీ పరిమాణంలో పెరుగుతోంది. శ్రీ వరసిద్ది వినాయకుని స్వయంభూ విగ్రహం సత్యాన్ని నిలబెడుతుందని నమ్ముతారు. ప్రజల మధ్య ఉన్న వివాదాలను వినాయకుడి విగ్రహం ముందు ప్రమాణం  చేయడం ద్వారా పరిస్కారం అవుతాయని ప్రజల విశ్వాసం. ఈ ప్రాంత ప్రజలు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఆలయ పవిత్ర పుష్కరిణిలో  పుణ్యస్నానం చేసి స్వామివారి ముందు ప్రమాణం చేయడం నిత్యం జరుగుతూ ఉంటుంది.

ఆలయ చరిత్ర 



ఈ ఆలయాన్ని 11వ శతాబ్దం CE ప్రారంభంలో చోళ రాజు కులోత్తుంగ చోళుడు-I నిర్మించారు మరియు 1336లో విజయనగర రాజవంశం చక్రవర్తులచే మరింత విస్తరించబడింది.

 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన దేవాలయం యొక్క స్థల పురాణం గురించి ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది. సుమారు 1000 సంవత్సరాల క్రితం, విహారపురి గ్రామ సమీపంలో ఉన్న ఒక భూమిని సాగు చేస్తూ ముగ్గురు శారీరక వికలాంగులు, మూగ, చెవిటి మరియు గుడ్డి వ్యక్తులు  జీవనోపాధి పొందుతూ ఉండేవారు. ఒకరోజు ఇద్దరు వ్యక్తులు పికాట్ సహాయంతో నీటిని తీస్తుండగా, మూడవ వ్యక్తి భూమికి సాగునీరు అందిస్తున్నాడు. కొంతసేపటికి బావిలో నీరు అయిపోయింది. ఒక వ్యక్తి పలుగు తీసుకుని బావిలోపల రాయిని కొట్టాడు మరియు రక్తం నిరంతరం ప్రవహించడం ప్రారంభించింది. ముగ్గురు వికలాంగులు రక్తం కలిపిన నీటిని తాకినప్పుడు, ఆశ్చర్యకరంగా వారు సాధారణ వ్యక్తులు అయ్యారు. కొంత సేపు తవ్విన తర్వాత బావిలో తలపై గాయంతో రక్తం కారుతున్న శ్రీ వరసిద్ది వినాయక విగ్రహం కనిపించింది. విగ్రహం పరిమాణం పెరగడం, తవ్వడం వల్ల విగ్రహాన్ని బయటకు తీయలేకపోయారు. ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేశారు. శ్రీ వరసిద్ది వినాయకుడిని పూజించేందుకు ప్రజలు కొబ్బరికాయలు, ఇతర పూజా సామాగ్రితో పరుగులు తీశారు. వారు వేలాది కొబ్బరికాయలను పగలగొట్టారు, కొబ్బరి నీరు పావు ఎకరం విస్తీర్ణంలో వ్యాపించింది. స్థానిక భాషలో దీనిని "కాని" అంటారు. అందుకే అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని "కాణిపాకం" అని పిలిచేవారు.



ఇప్పుడు కూడా శ్రీ వరసిద్ది వినాయక విగ్రహం చుట్టూ ఉన్న బావిని మనం చూడవచ్చు. విగ్రహం చుట్టూ ఎప్పుడూ నీరు కనిపిస్తుంది. విగ్రహం తలపై ఉన్న గాయాన్ని కూడా మనం చూడవచ్చు.ఇంకో ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే, విగ్రహం పరిమాణం పెరుగుతోంది. 1947లో అరగొండ గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రీ బెజవాడ సిద్దయ్య అనే భక్తుడు స్వామివారికి వెండి కవచాన్ని బహూకరించాడు, అది విగ్రహాన్ని సరిగ్గా అమర్చింది. ఇప్పుడు అది విగ్రహానికి సరిపోవడం లేదు. విగ్రహం పరిమాణం పెరుగుతోంది. అన్ని కాలాల్లో విగ్రహం చుట్టూ ఎప్పుడూ ఒకే స్థాయిలో నీరు ఉంటుంది. ఈ పవిత్ర జలం ఇతర భక్తులందరికీ తీర్థంగా ఇవ్వబడుతుంది.

శ్రీ వినాయక స్వామి "స్వయంభూ" గా వెలసిన కాణిపాకం బహుదా నది పక్కన ఉంది. నదిని బహుదా అని పిలవడానికి పురాతన పురాణం ఉంది. కాణిపాకంలో వినాయక స్వామి స్వయంభువుగా వెలిసిన తరువాత, శంకుడు మరియు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు స్వయంభూ శ్రీ వినాయకుని దర్శనం చేసుకోవాలని కోరుకున్నారు, వారు నడక మార్గంలో వారి ప్రయాణం కొనసాగించారు. ఆలా చాల దూరం  ప్రయాణం తరువాత, వారిలో చిన్న వాడైనా లిఖితుడు చాలా అలసిపోయాడు, ఆకలితో కూడా ఉన్నాడు అక్కడికి ప్రక్కనే వున్నా మామిడి  చెట్టు నుండి మామిడి పండ్లను తీసుకోవాలనుకుని అతనికి సహాయం చేయమని అతని సోదరుడిని కోరాడు. దానికి అతను పండు రాజుకు చెందుతుంది కాబట్టి తీసుకోవద్దని అన్నయ్య హెచ్చరించాడు. కానీ బాగా అలసిపోయి, ఆకలితో, దాహంతో ఉన్న తమ్ముడు మామిడి పండును తీసుకుని తిన్నాడు. అన్న శంకుడు తన తమ్ముడిని రాజు దగ్గరకు తీసుకుని వెళ్లి  తన తమ్ముడు  చేసిన పండు దొంగతనం గురించి వివరించి శిక్ష విధించమని కోరాడు. దురదృష్టవశాత్తు, రాజు కోపంతో, అనుమతి లేకుండా పండును దొంగిలించిన తమ్ముడి రెండు చేతులను నరికివేయమని తీవ్రంగా ఆదేశించాడు వెంటనే  శిక్ష అమలు చేయబడింది.

ఆలా  చేతులు పోగొట్టుకున్న తన తమ్ముడి  ఈ దురదృష్టకర సంఘటనకు అన్నయ్య చాలా బాధపడ్డాడు అలాగే  చివరికి దర్శనానికి వెళ్లే ముందు స్వయంభూ వినాయక దేవాలయం సమీపంలోని నదిలో పుణ్యస్నానం చేయాలని కోరుకున్నాడు, మరియు సోదరులిద్దరూ నీటిలో పవిత్ర పుణ్యస్నానం ఆచరిస్తూ  వినాయకుడిని ప్రార్థించడం ద్వారా  ఆశ్చర్యకరంగా, తమ్ముడు లిఖితుడు చేతులు గతంలో ఉన్నట్లే తిరిగి రావడం జరిగింది. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ వినాయక స్వామిని దర్శనం చేసుకొని సంతోసంతో మొక్కుకున్నారు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ స్వయంభూ శ్రీ వినాయకుని దయను ఇరుగుపొరుగు గ్రామస్తుల్లో ప్రచారం చేశారు. ఆ తర్వాత వినాయకుడు పోయిన చేతులను (బహుదా) లిఖితుడికి బహుమతిగా ఇచ్చిన నదిని "బహుదా నది" అని పిలుస్తారు.

వివాదాలను పరిష్కరించడం: 



ప్రజలు ఇక్కడకు వచ్చి "ప్రత్యేక ప్రమాణం" చేసి తమ వివాదాలను పరిష్కరించుకుంటారని నమ్ముతారు. ఆచారాల ప్రకారం వివాదంలో ఉన్న వ్యక్తులు ఆలయ పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి స్వామివారి ముందు ప్రమాణం చేస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట సంఘటన గురించి ప్రమాణం చేస్తే (ప్రమాణం) అది 'నిజం'గా తీసుకోబడుతుంది. చాలా వరకు వివాదాలు ఈ పద్ధతిలో పరిష్కరించబడతాయి. ప్రజలు దీనిని కోర్టు తీర్పు కంటే ఎక్కువగా తీసుకుంటారు. ఎవరైనా స్వామి వారి  ముందు తప్పుడు ప్రమాణాలు చేస్తే, శ్రీ వరసిద్ది వినాయకుడు శిక్షిస్తాడు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రూ. 516/- ఆలయ అధికారులు వసూలు చేస్తారు. ఈ వేడుక ప్రతి రోజు జరుగుతుంది. తద్వారా ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుందని విశ్వాసం.

గణపతి దీక్ష విధానం

ప్రాచీన వేదాలలో శ్రీ వరసిద్ది వినాయకుడు దేవతలు, గంధర్వులు, రాక్షసులు మరియు మనుష్యులందరి గుణాలకు అధిపతిగా కీర్తించబడ్డాడు. 'అదర్వశీర్షోపనిషత్'లో శ్రీ వరసిద్ది వినాయకుడు పరమాత్మ యొక్క పరబ్రహ్మ స్వరూపంగా కీర్తించబడ్డాడు. అందుచేత 'గణపతి దీక్ష' తీసుకోవడం ద్వారా భక్తులు శ్రీ గణేశుని ఆశీస్సులతో తమ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. దీక్ష 41 రోజులు (మండలం), 21 రోజులు (అర్ధ మండలం), 11 రోజులు (ఏకాదశ) ఉంటుంది. ఇది స్వామి అయ్యప్ప (లేదా) లార్డ్ శివదీక్ష వంటిది. మరియు నియమాలు మరియు నిబంధనలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. శ్రీ గణేష్ దీక్షను ఏదైనా గణేష్ ఆలయంలో ప్రారంభించవచ్చు కానీ కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో మాత్రమే ముగించాలి.

ఆలయ ప్రత్యేకతలు 

మూల విగ్రహం (ప్రధాన దేవత) యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇది ఉత్తరం వైపు ఉంటుంది, ఇది చాలా అరుదు. సూర్యుని మొదటి కిరణాలు భగవంతుని పాదాలపై పడతాయి. భగవంతుని శిరస్సుపైకి చేరిన తర్వాత సూర్యకిరణాలు క్రమంగా అదృశ్యమవుతాయి. ప్రధాన విగ్రహం పరిమాణం పెరుగుతోందని చెబుతారు, సంవత్సరం తరువాత, మరియు 1945 నుండి వివిధ పరిమాణాల వెండి కవచం, ఆలయ ప్రధాన ద్వారం వద్ద ప్రదర్శించబడుతుంది.

స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి



ప్రతి మంత్రంలోని మొదటి భాగం ‘ఓం’. ఓం రాక్షసులు మరియు రాక్షసులతో (చెడు చేసేవారితో) పోరాడిన గణాల దేవుడు 'గణపతి'ని సూచిస్తుంది. యాగాన్ని కొనసాగించలేక, ఋషులు ప్రశాంతంగా జీవించడానికి వీలులేనప్పుడు మరియు కర్మలను కొనసాగించడానికి వారు శివుడిని సంప్రదించారు. శివుడు ఋషుల తపస్సుకు సంతోషించి, వారి బాధలనుండి విముక్తి పొందుతారని వారికి హామీ ఇచ్చాడు. అది గణాలకు అధిపతిగా శ్రీ వినాయకుని గణాధిపతి పదవిని అధిష్టించిన ప్రకటన. శ్రీ వరసిద్ది వినాయకుడిని పార్వతి థానవ, గణేష్, లమోదర, గజానన మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. పద్మ పురాణం, లింగ పురాణం మరియు శివ పురాణం వంటి పురాణాలలో అతని దైవిక పుట్టుక మరియు ఉనికి గురించి దేవతలు కూడా పూజిస్తారు, ఏదైనా ప్రారంభించడానికి ముందు అడ్డంకులను అధిగమించడానికి. ఇతర దేవుళ్ళకు మరియు దేవతలకు పూజ కూడా శ్రీ గణేశుని ఆవాహనతో ప్రారంభమవుతుంది. శ్రీ వరసిద్ది వినాయకుని ఆశీర్వాదంతో ఆరాధించకపోతే ఏ దేవునికి తిరిగి పూజ చేసినా అది వ్యర్థమని విష్ణువు ప్రకటించాడు.

శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి 



గణేశుడు బ్రహ్మచారి అంటే అవివాహితుడు అని ఒక సంప్రదాయం చెబుతోంది. ఇది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. ఉత్తర భారతదేశంలో ఉన్నప్పుడు, గణేశుడు బ్రహ్మ యొక్క ఇద్దరు కుమార్తెలను వివాహం చేసుకున్నట్లు చెపుతారు, అనగా బుద్ధి (జ్ఞానం) మరియు సిద్ధి (ఆధ్యాత్మిక శక్తి). శ్రీ వినాయక స్వామిని సిద్ధి బుద్ధి సమేత వినాయకుడిగా పూజించే అనేక పూజా కేంద్రాలు భారతదేశంలో ఉన్నాయి.

నవగ్రహాలు



నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలు హిందూమతం మరియు హిందూ ఆచారాలలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. మనిషి విధిని నిర్ణయించడంలో నవగ్రహాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. నవగ్రహాలు అంటే సూర్యుడు (సూర్యుడు), చంద్రుడు (చంద్రుడు), మంగళం (మార్స్), బుధుడు (బుధుడు), బృహస్పతి (గురు గ్రహం), శుక్రుడు (శుక్రుడు), శని (శని), రాహువు (ఉత్తర చంద్ర నోడ్) మరియు కేతువు (దక్షిణ చంద్ర నోడ్). ) ఈ తొమ్మిది గ్రహాల దేవతలు మానవ జీవితాలను ప్రభావితం చేస్తారని మరియు జీవితంలో ఒకరు ఎదుర్కొనే అన్ని మంచి లేదా చెడు సమయాలకు బాధ్యత వహిస్తారని నమ్ముతారు.

సేవ వివరాలు 

  •  గోపూజా దంపతులు లేదా ఒంటరి వ్యక్తి అనుమతించబడతారు..రూ. 250.00 / 2Persons 
  • క్షీరాభిషేకం (పాలాభిషేకం)జంట లేదా ఒంటరి వ్యక్తి అనుమతించబడతారు. భక్తులు 2 లీటర్లకు తగ్గకుండా పాలు తీసుకురావాలి. యాత్రికులు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. మగ: ధోతీ, ఆడ: చీర / హాఫ్ చీర / దుపట్టాతో చుడీదార్. దయచేసి SevaRలను ప్రారంభించడానికి 15 నిమిషాల ముందు నివేదించండి. 200.00 / 2 Persons
  • మహాహారతి ఒంటరి వ్యక్తి అనుమతించబడతారు..రూ. 200.00 / 1 Person
  • పంచమూర్త అభిషేకం దంపతులు లేదా ఒంటరి వ్యక్తి అనుమతించబడతారు, దేవస్థానం ద్వారా పూజా సామాగ్రి ఏర్పాటు చేయబడుతుంది.ఒక పైవస్త్రం, ఒక బ్లౌజ్ ముక్క, వినాయకుని ఫోటో. యాత్రికులు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. మగ: ధోతీ, ఆడ: చీర / హాఫ్ చీర / దుపట్టాతో చుడీదార్. దయచేసి SevaRలను ప్రారంభించడానికి 15 నిమిషాల ముందు నివేదించండి. 700.00 / 2 Persons
  • సామూహిక శ్రీ లక్ష్మీ గణపతి హోమం సామూహిక గణపతి హోమం గణపతి హోమం (అనౌటి మండపంలో). దేవస్థానం వారు పూజా సామాగ్రి ఏర్పాటు చేస్తారు. టికెట్ హోల్డర్‌కు మూడు లడ్డూలను అందజేస్తున్నారు. దయచేసి సేవ ప్రారంభించటానికి 15 నిమిషాల ముందు నివేదించండి యాత్రికులు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. పురుషులు: ధోతీ, స్త్రీ: చీర / హాఫ్ చీర / దుపట్టాతో చుడీదార్. రూ. 1000.00 / 2 Persons
  • సహస్ర నామ అర్చన సేవ దంపతులు లేదా ఒంటరి వ్యక్తి అనుమతించబడతారు, దేవస్థానం ద్వారా పూజా సమగ్రి ఏర్పాటు చేయబడుతుంది. యాత్రికులు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. మగ: ధోతీ, ఆడ: చీర / హాఫ్ చీర / దుపట్టాతో చుడీదార్. దయచేసి SevaRలను ప్రారంభించడానికి 15 నిమిషాల ముందు నివేదించండి. 1000.00 / 2Persons 
  • సంకటహర గణపతి వ్రతం సామూహిక సంకటహర గణపతి వ్రతం ఒంటరి వ్యక్తి అనుమతించబడతారు.రూ. 350.00 / 1 Persons
  • సంకటహర గణపతి వ్రతం పరోక్ష సేవాపరోక్ష సేవ దేవస్థానం వారిచే నిర్వహించబడుతుంది.రూ. 350.00 / 1 Persons
  • సిద్ది బుడ్డి సమేత గణపతి కల్యాణం సామూహిక కల్యాణోత్సవం కల్యాణోత్సవం (అనౌయేటి మండపంలో) పూజా సామాగ్రి దేవస్థానంచే ఏర్పాటు చేయబడుతుంది. జంట లేదా ఒంటరి వ్యక్తి అనుమతించబడతారు. పూజా సామాగ్రి దేవస్థానం ద్వారా సరఫరా చేయబడుతుంది ఒక శేష వస్త్రం, ఒక బ్లౌజ్ ముక్క మరియు మూడు లడ్డూలను ప్రసాదంగా అందజేస్తారు. యాత్రికులు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. పురుషులు: ధోతీ, స్త్రీ: చీర / హాఫ్ చీర / దుపట్టాతో చుడీదార్. రూ. 1116.00 / 2 Persons
  • సిద్ది బుద్ది సమేత గణపతి కళ్యాణం పరోక్ష సేవాపరోక్ష సేవ దేవస్థానం వారిచే నిర్వహించబడుతుంది.రూ. 1116.00 / 5 Persons
  •  శ్రీ లక్ష్మీ గణపతి హోమం ( భక్తుల ద్వారా )వ్యక్తిగత సేవా గణపతి హోమం (అనౌటి మండపంలో). దేవస్థానం వారు పూజా సామాగ్రి ఏర్పాటు చేస్తారు. హోమం మరియు దర్శనానికి ఇద్దరు భక్తులను అనుమతిస్తారు. కండువ, జాకెట్ ముక్క మరియు ఒక లడ్డూ ప్రసాదం హోల్డర్‌కు అందజేయబడుతుంది.(వ్యక్తిగత సేవ) దయచేసి సేవఆర్‌లను ప్రారంభించడానికి 15 నిమిషాల ముందు నివేదించండి. 2000.00 / 2 Persons
  • శ్రీ లక్ష్మీ గణపతి హోమం పరోక్ష సేవాపరోక్ష సేవ దేవస్థానం వారిచే నిర్వహించబడుతుంది.రూ. 1000.00 / 5సుప్రబాత సేవ(బిందు తీర్థ అభిషేకం)సుప్రబాత సేవ(బిందు తీర్థ అభిషేకం) యాత్రికులు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. మగ: ధోతీ, ఆడ: చీర / హాఫ్ చీర / దుపట్టాతో చుడీదార్. జంట లేదా ఒంటరి వ్యక్తి అనుమతించబడతారు. దేవస్థానం ఆధ్వర్యంలో పూజా సామాగ్రి ఏర్పాట్లు చేయనున్నారు. ఒక పై గుడ్డ, ఒక బ్లౌజ్ ముక్క, లామినేషన్ గణేశుడి ఫోటో రూ. 750.00 / 2Persons

దర్శనం

  1. అతి సీగ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం త్వరిత దర్శనం రూ. 150.00 /
  2. నిజరూప దర్శనం నిజరూప దర్శనం రూ. 100.00 /
  3. సీగ్ర దర్శనం సీగ్ర దర్శనం కౌంటర్ రూ. 100.00 /
కాణిపాకం వినాయక ఆలయ సమయం ఉదయం 4:00 నుండి రాత్రి 9:30 వరకు. కొన్నిసార్లు మీరు వెయిటింగ్ లైన్‌లో ఉండవలసి ఉంటుంది. దర్శనం కోసం వేచి ఉండే లైన్ 15 నుండి 60 నిమిషాల వరకు ఉంటుంది.

కాణిపాకం దేవాలయం దగ్గర ఎక్కడ బస చేయాలి?

 తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ భక్తుల కోసం 14 గదుల కార్యకలాపాలను నిర్వహిస్తుండగా, ఆలయ నిర్వహణ 6 అతిథి గదులను నిర్వహిస్తుంది కాబట్టి మీరు కాణిపాకం ఆలయ వసతి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరో 100 గదుల హోటల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. దేవాలయం అందించే వసతితో పాటు, చిత్తూరు నగరం సందర్శకులకు అనేక అధిక నాణ్యత గల ప్రైవేట్ హోటళ్ళు మరియు లాడ్జీలను అందిస్తుంది.

కాణిపాకం ఆలయానికి ఎలా చేరుకోవాలి?

విమానం ద్వారా: 
మీరు హైదరాబాద్ మరియు చెన్నై నుండి తిరుపతికి నేరుగా విమానాలను పొందవచ్చు. 
రైలు ద్వారా: 
మీరు తిరుపతి నుండి చిత్తూరుకు నేరుగా రైలును పొందవచ్చు 
రోడ్డు వయా: 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బెంగళూరు మరియు చిత్తూరు మధ్య రోజువారీ బస్సులను నడుపుతుంది. తిరుపతి నుండి 70 కి.మీ దూరంలో ఉన్న కాణిపాకం వినాయక ఆలయానికి నేరుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి

మీరు సందర్శించగల సమీపంలోని కొన్ని ప్రదేశాలు

 శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న కొన్ని ఆలయాలు: 
  • తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం 
  • శ్రీకాళహస్తి శివాలయం 
  • అర్ధగిరి హనుమాన్ ఆలయం 
  • మానికంటేశ్వర ఆలయం  
  • వరదరాజ  స్వామి ఆలయం

19, డిసెంబర్ 2024, గురువారం

*ఓంకారం విశిష్ట‌త‌.*

 


*ఓంకారం విశిష్ట‌త‌.*
*మ‌న‌లో చాలామంది ప్ర‌శాంత‌త కోసం నిశ్శ‌బ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎంద‌రో శ్ర‌వ‌ణానందం క‌లిగించే శ‌బ్దాన్ని సంగీతం రూపంలో ఆస్వాదిస్తారు.*
*పంచ‌భూతాల్లో శ‌బ్దం అన్నింటిక‌ంటే ముందు ఉంటుంద‌ని పండితులు చెబుతారు. ఆ శ‌బ్దం ఆకాశం నుంచి వ‌స్తుంది. శ‌బ్దానికి ఆధారం ఓంకారం.*
*నిజానికి ఓంకారం ప్ర‌తి దేహంలో ఉంటుంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితం అవుతుంది.*
*‘ఓం’ అన్న‌ది మంత్రం కాదు..! మ‌త సంబంధ‌మైన‌ది అస‌లే కాదు.. వేదాల‌లో నిక్షిప్త‌మైన ఓంకార నాదం మానవ ఆరోగ్య ర‌హ‌స్యానికి ఒక సూత్రం.*
*ప్రాచీన కాలంలో ఋషులు వాత‌వార‌ణ ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుని ఉప‌వాస దీక్ష‌ల‌లో కూడా ఆరోగ్య‌వంతంగా ఉండ‌టం వెనుక ఓంకార నాద‌మే ర‌హ‌స్యం.*
*విదేశాల్లోని విశ్వ‌విద్యాల‌యాల్లో జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో సైతం ఓంకారం మృత్యుంజ‌య జ‌పం అని బ‌య‌ట‌ప‌డింది.*
*ఓంకారాన్ని, మ‌తాన్ని ముడిపెట్ట‌డం వ‌ల్ల ఓంకారం చేసే మేలు ప‌రిమితం ‌ అవుతుంది.*
*ఓంకారం ఉచ్ఛ‌రించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు…*
*నాభిలోంచి ల‌య‌బ‌ద్ధంగా ఓంకార ప‌దాన్ని ప‌ల‌క‌గ‌లిగితే మాన‌వుడి ఆరోగ్యం ప‌రిపూర్ణంగా ఉంటుంది.*
*ఓంకారం ప‌దిహేను నిమిషాల పాటు ఉచ్చ‌రించ‌గ‌లిగితే ర‌క్త‌పోటు త‌గ్గుతుంది.*
*ర‌క్త‌ ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రిగి గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.*
*మాన‌సిక అల‌స‌ట‌, అల‌జ‌డి త‌గ్గి ప్ర‌శాంతత క‌లుగుతుంది.*
*ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌డుతుంది.*

తిరుమల శ్రీవారి ఆలయంలో అతిపెద్ద పూలబావి..!!

 


తిరుమల శ్రీవారి ఆలయంలో అతిపెద్ద పూలబావి..!!
🌿ఆపద మ్రొక్కులవాడు కొలువై ఉన్న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అతి పెద్ద బావి ఉంది. స్వామివారికి అలంకరించిన తులసి, పుష్పం, పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం లేదు.
🌸 స్వామివారికి అలంకరించిన తులసి, పుష్పం, పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం లేదు. అందువల్ల ఆ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఆలయంలోని బావిలో వేస్తారు. ఈ బావినే పూలబావి అంటారు.
🌿పూల బావికి మరో పేరుంది. అదే భూతీర్థం. పూర్వం తిరుమల క్షేత్రంలో భూదేవి చేత ఏర్పరబడిన ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమై పోయింది. అనంతరం శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తులు ఒక బావిని తవ్వగా భూ తీర్థం మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
🌸రంగదాసు ఆ బావిలోని నీళ్లను వాడుతూ, శ్రీ వేంకటేశ్వరుని పూజకై సంపెంగ చేమంతుల మ్రొక్కలతో ఒక తోటను పెంచాడు. మళ్లీ ఆ రంగదాసుడే తొండమాను చక్రవర్తిగా జన్మించగా శ్రీ వేంకటేశ్వరస్వామి గత జన్మలో అతను నిర్మించిన ఈ శిథిలమైన బావిని మళ్ళీ పునరుద్ధరించమని ఆదేశించగా
🌿 తొండమానుడు దానిని రాతితో కట్టి పునరుద్ధరించి శ్రీ స్వామివారికి ప్రతి పాత్రుడై ఉంటే అవసరమైనప్పుడు ఆ బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసున్ని దర్సించుకుని వెళుతూ ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి.
🌸ఒకప్పుడు యుద్ధంలో శత్రువులతో తరుమబడిన తొండమానుడు రహస్య బిలం ద్వారా పరుగు పరుగున వచ్చి శ్రీనివాసుని చేరాడంట. ఏకాంతసేవ సమయంలో శ్రీనివాసునితో ఉన్న వేళలో అభ్యంతర మందిరంలోకి ప్రవేశించిన తొండమానుణ్ణి చూసి సిగ్గుతో శ్రీదేవి శ్రీస్వామివారి వక్ష స్థలంలోను, భూదేవి తొండమానుడు కట్టించిన ఈ బావిలోను దాక్కొన్నారట. వరాహ పురాణాంతర్గత వేంకటాచల మహత్మ్యం అంతా ఇంతా కాదు.
🌿ఆ తర్వాత భగవద్రామానుజుల వారు తిరుమలకు వేంచేసి ఉన్నప్పుడు ఈ భూతీర్థంమనెడి బావిని చూసి అందులో భూదేవి, శ్రీదేవి దాగి కొనుట అనెడి పురాణ ప్రవచనాన్ని బట్టి, ఆ బావిలోనే భూదేవిని ప్రతిష్టించి, తీర్థాధిపతిగా శ్రీనివాసునికి అర్చన నివేదనాదులు జరుగుతున్నట్లు ఏర్పాటు చేశారని,
🌸 అంతే కాకుండా ప్రతిరోజు శ్రీ స్వామివారికి అలంకరింపబడి తొలగింపబడే నిర్మాల్యాన్ని భూదేవి కోసమే ఈ బావిలో వేసేట్లుగా నిర్ణయించారని శ్రీ వేంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథం తెలుపుతున్నది.
🌿అప్పటి నుంచి నిత్యమూ పుష్పాంకార ప్రియుడైన శ్రీనివాసునికి అలంకరించి తొలగించిన తులసి, పూలమాలలు ఈ బావిలో సమర్పించడం జరుగుతోంది. కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, అదీ తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవ సమయంలో మాత్రమే తిరుచానూరు పంచమీతీర్థం రోజున తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి అలంకరించిన పూలమాలలు, పసుపు కుంకమలు, పరిమళ ద్రవ్యాలు, చీర, రవికలు, లడ్డూలు, వడలు తదితర ప్రసాదాలు ఛత్రచామర బాజాభజంత్రీలు వగైరా సకల రాజోపచారాలతో వృష, గజ తురగ భక్త బృందాలతో తిరుమల నుంచి కాలినడకన తిరుచానూరుకు వెళ్ళి శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు.
🌸అదేరోజు అమ్మవారికి వాటిని అలంకరించిన తరువాత చక్రస్నానం జరుగుతుంది. ఇలా నేటికీ జరుగుతూ ఉన్న సనాతన సాంప్రదాయం ఇది. ఈ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో శ్రీవారి నిర్మాల్యాన్ని ఈ బావిలోనే సమర్పించడం జరుగుతోంది.
🌿అయితే ఇటీవల కాలంలో తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే సేవల్లోను విశేషంగా పుష్పాలంకరణ జరుగుతతున్నందు వల్ల విపరీతంగా పేరుకుపోతున్న ఈ నిర్మాల్యాన్ని తిరుమల పర్వత సానువుల్లో ఎవరూ తొక్కని చోట జారవిడవటం జరుగుతోంది.
🌸ఈ పూలబావి పూర్వం మెట్లు ఉన్న దిగుడు బావిగా ఉండేది. ఆ తరువాత కాలంలో చుట్టూ రాతి గోడతో ఈ బావి గుండ్రమైన చేదురుబావి వలె పునర్నిరమింపబడింది.
🌿ఇటీవల ఈ బావిపై ఇనుపకడ్డీల తడకను కప్పి వాటిపై పూల కుండీలను ఏర్పాటు చేశారు. శ్రీదేవి, భూదేవి, పరమ భక్తాగ్రేసరుడైన తొండమాను చక్రవర్తిని, భగవద్రామానుజల వారిని, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని స్మరింపజేస్తూ శ్రీవారి పవిత్ర నిర్మాల్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటోంది ఈ పూల బావి ఎంతో గొప్పది కదా.!.
🌹ఓం నమో వెంకటేశాయ 🌹

18, డిసెంబర్ 2024, బుధవారం

ధ్యానం వల్ల 100 ప్రయోజనాలు.....

 


ధ్యానం - ధన్యం........!!
ధ్యానం వల్ల 100 ప్రయోజనాలు.....
1. ధ్యానం *ఆత్మ సామీప్యాన్ని* పెంచుతుంది
2. ధ్యానం ద్వారా *జీవిత దృక్పథాన్ని* మార్చుకోవడం
3. ధ్యానం ద్వారా *హృదయాన్ని* బలపరచడం
4. ధ్యానం ద్వారా *ఆత్మ* మేల్కొలుపు
5. ధ్యానం *వ్యాధి*కి రోగనిరోధక శక్తిని పెంచుతుంది
6. ధ్యానం *శారీరక* రుగ్మతలను దూరం చేస్తుంది
7. ధ్యానం ద్వారా *మెదడు* యొక్క ఉద్దీపన
8. ధ్యానం ద్వారా *మనస్సు*ని శాంతపరచడం
9. ధ్యానం ద్వారా *క్లిష్ట పరిస్థితులను* మార్చడం
10.ధ్యానంతో *ఒత్తిడి* మాయమవుతుంది
11. ధ్యానం ద్వారా *కోపాన్ని* తగ్గించడం
12. ధ్యానం *ఆత్మవిశ్వాసాన్ని* పెంచుతుంది
13. ధ్యానం ద్వారా *సమస్యలు* లేకపోవడం
14. ధ్యానం ద్వారా *అంగీకార వైఖరి* సాధించడం
15. ధ్యానం ద్వారా *మనశ్శాంతి*
16. ధ్యానం * సహనానికి* కారణమవుతుంది
17. ధ్యానంతో *అనుబంధాన్ని* పెంచుకోండి
18. ధ్యానం ద్వారా *నాయకత్వాన్ని* అభివృద్ధి చేయడం
19. ధ్యానం *మంచి నిద్ర*కి దారితీస్తుంది
20. ధ్యానం ద్వారా *సంస్కారం*పొందడం
21. ధ్యానం *సంతోషాన్ని* సాధ్యం చేస్తుంది
22. ధ్యానం నుండి *కర్మ* తీసివేయడం
23. ధ్యానం ద్వారా *పాపం* అదృశ్యం
24. ధ్యానం ద్వారా *సామర్థ్యం* పెరగడం
25. ధ్యానం ద్వారా *చెడులను* తొలగించడం
26. ధ్యానం *అశాంతమైన* మనసును తొలగిస్తుంది
27. *మేధస్సు* ధ్యానం ద్వారా పదును పెట్టబడింది
28. ధ్యానం ద్వారా *అహం* కరిగిపోవడం
29. ధ్యానంతో *సృజనాత్మకతను* పెంపొందించడం
30. ధ్యానం ద్వారా *విలువలు* పెరగడం
31. ధ్యానం ద్వారా *ఆధ్యాత్మిక శక్తి*మేల్కొలుపు
32. ధ్యానం ద్వారా *భయం* లేకపోవడం
33. ధ్యానం ద్వారా *బంధుత్వాన్ని* అభివృద్ధి చేయడం
34. ధ్యానం ద్వారా *ఆరోగ్యాన్ని* మెరుగుపరచడం
35. ధ్యానం నుండి *తృప్తి* పొందడం
36. ధ్యానం ద్వారా *నిర్ణయం* స్పష్టమవుతుంది
37. ధ్యానం *పాజిటివ్ ఎనర్జీ*ని సృష్టిస్తుంది
38. ధ్యానం ద్వారా *వాతావరణాన్ని* శుద్ధి చేయడం
39. ధ్యానం ద్వారా *ప్రతికూల లక్షణాలను* తొలగించడం
40. ధ్యానం నుండి *దైవ తరంగం* పుడుతుంది
41. ధ్యానం ద్వారా * సూక్ష్మాలు లేకపోవడం
42.ధ్యానం *పోరాటాన్ని* తొలగిస్తుంది
43. ధ్యానం ద్వారా *విభజన* లేకపోవడం
44. ధ్యానం ద్వారా *శాంతి* పొందడం
45. ధ్యానం ద్వారా *నిస్పృహ* ఉపశమనం
46. ధ్యానం ద్వారా *ఆలోచనల* రూపాంతరం
47. ధ్యానం ద్వారా *రిలాక్సేషన్*
48. ధ్యానం ద్వారా *దేవుని స్వామీప్య*సాధ్యమవుతుంది
49. ధ్యానం *ఆనందం, శాంతి, ప్రశాంతత మరియు ఆనందాన్ని* తెస్తుంది
50. ధ్యానం *ప్రాణశక్తి*ని పెంచుతుంది
51. ధ్యానం ద్వారా *శరీర కణాలు*బలపడుతోంది
52. ధ్యానం *అవగాహన* పెంచుతుంది
53. ధ్యానం ద్వారా *మానవ ధర్మాలు* పెరగడం
54. ధ్యానం ద్వారా *కోరికలు* లేకపోవడం
55. ధ్యానం ద్వారా *జ్ఞానాన్ని* పెంచుకోండి
56. ధ్యానం ద్వారా *సృష్టి రహస్యాన్ని* తెలుసుకోవడం
57. ధ్యానం వల్ల *ప్రాపంచిక కోరికలు* నశిస్తాయి
58. ధ్యానం నుండి *శరణాగతి భావం* పుడుతుంది
59. ధ్యానం ద్వారా *జీవన శైలి*ని మార్చుకోవడం
60. ధ్యానం ద్వారా *బలహీనత* తొలగింపు
61. ధ్యానం *ప్రవర్తన* మెరుగుపరుస్తుంది
62.ధ్యానం *సత్వగుణాన్ని* పెంచుతుంది
63. ధ్యానం ద్వారా *మత స్పృహ* మేల్కొలుపు
64. ధ్యానం ద్వారా *సంప్రదాయం* సాధించడం
65. ధ్యానం నుండి ఆత్మ యొక్క *భక్తి భావన పుడుతుంది
66. ధ్యానం ద్వారా *సన్మార్గం* పొందడం
67. ధ్యానం ద్వారా *సాంస్కృతిక ఉద్ధరణ*
68. ధ్యానం నుండి *భావ బంధన్* తీసివేయడం
69. ధ్యానం ద్వారా *స్వీయ దైవాన్ని* చూడడం
70. ధ్యానం ద్వారా *జీవిత సారాన్ని* తెలుసుకోవడం
71. ధ్యానం ద్వారా *గురు కారుణ్య* సాధ్యమవుతుంది
72.ధ్యానం ద్వారా *ప్రేత బాధ* లేకపోవడం
73. ధ్యానం ద్వారా *కామ క్రోధాదిలు* లేకపోవడం
74. ధ్యానం నుండి *కృతజ్ఞతా భావం* పుడుతుంది
75. ధ్యానం వల్ల *భవరోగం* నశిస్తుంది
76. ధ్యానం ద్వారా *అంతర్గత* శుద్ధి
77. ధ్యానం ద్వారా *వివేకా* మేల్కొంటాడు
78. ధ్యానం ద్వారా *పీడకల* నుండి విముక్తి పొందడం
79. *ఇష్టార్థ* ధ్యానం ద్వారా సిద్ధిస్తుంది
80. ధ్యానం ద్వారా *వైరాగ్య* ప్రాప్తి
81. ధ్యానం ద్వారా *కోరికలు* లేకపోవడం
82.*బ్రాహ్మణ జ్ఞానం* ధ్యానం నుండి పుడుతుంది
83. ధ్యానం ద్వారా *సంసార మోహ* నుండి విముక్తి పొందడం
84. ధ్యానం నుండి *అసహ్యం* ఉద్రేకం
85. ధ్యానం ద్వారా *మనస్సు యొక్క వరద* తగ్గింపు
86. ధ్యానం నుండి *సత్కర్మ* పుడుతుంది
87. ధ్యానంతో *ఆత్మ ప్రేమ* పెరుగుతుంది
88. ధ్యానం ద్వారా *ఏకాంత మౌనం* తయారీ
89. ధ్యానం ద్వారా *అసూయ* లేకపోవడం
90. ధ్యానం ద్వారా *నిర్వికార స్థితి* లభిస్తుంది
91. ధ్యానం *జననం మరియు మరణం* యొక్క చక్రాన్ని విడుదల చేస్తుంది
92.ధ్యానం ద్వారా *జీవితాన్ని* పెంచుకోండి
93. ధ్యానం నుండి *మెరిట్* పుడుతుంది
94. ధ్యానం ద్వారా *మనస్సు* అభివృద్ధి
95. ధ్యానం *శ్రేయస్సు*ని కలిగిస్తుంది.
96. ధ్యానం ద్వారా *సకల సుకృత* ప్రాప్తి.
97. ధ్యానం ద్వారా *చీకటి* అదృశ్యం.
98. ధ్యానం ద్వారా *అన్ని చెడులను* వదిలించుకోవడం.
99. ధ్యానం ద్వారా *సేవా స్ఫూర్తి* పెంపొందించుకోవడం.
100. ధ్యానం ద్వారా *సత్య సాక్షాత్కారం, స్వీయ-సాక్షాత్కారం*
ధ్యానం ప్రారంభించండి .......
కలుపు మొక్కలు తోటని, ఫలప్రదమైన ఫొలాలని తినేస్తాయని అందరికీ తెలుసు. అందుకని అటు తోటమాలి, ఇటు రైతు కలుపు మొక్కల్ని ఏరుతూనే వుండాలి. మన వ్యక్తిత్వం పెంచుకోవడానికి కూడా ఇదే మార్గం.
మనకున్న లోపాలు, మన లక్షణాలు మనకి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలీదు. అందుకని వాటిని సరిదిద్ది ఆ కలుపు మొక్కలను మనమే ఏరిపారేయాలి. అప్పుడు మన ఎదుగుదల శక్తివంతంగా ఫలప్రదంగా సాగుతుంది.
మనం భగవంతునికి శరణాగతి అయి, మనలను సమర్పించుకుంటే, అందుకు ప్రతిగా భగవంతుడే మనకు లభిస్తాడు.
(నీవు కలిగి ఉన్నవే గాక భగవంతునికి ఉన్నవని నీకు లభిస్తాయి.)
సమస్తము ఆత్మస్వరూపమే......
ఎవడు ఆత్మకంటే ఇతర బ్రాహ్మణజాతిని తెలిసికొనునో వానిని బ్రాహ్మణజాతి అన్యముగా చేయును. ఎవడు ఆత్మకంటే వేరుగా ఇతర క్షత్రియ జాతిని తెలిసికొనునో వానిని క్షత్రియ జాతి అన్యముగా చేయును. ఎవడు లోకములను ఆత్మకంటే వేరుగా తెలిసికొనునో వానిని లోకములు అన్యముగా చేయును. ఎవడు దేవతలను ఆత్మకంటే వేరుగా తెలిసికొనునో వానిని దేవతలు అన్యముగా చేయును. ఎవడు భూతములను ఆత్మకంటే వేరుగా తెలిసికొనునో వానిని భూతములు అన్యముగా చేయును. ఎవడు సర్వమును ఆత్మకంటే వేరుగా తెలిసికొనునో వానిని సర్వము అన్యముగా చేయును. ఈ బ్రాహ్మణ జాతి, ఈ క్షత్రియ జాతి, ఈ లోకములు, ఈ దేవతలు, ఈ భూతములు, ఈ సర్వమును సృష్టి, స్థితి, లయ కాలములయందు ఆత్మయందు పుట్టుచు, ఆత్మయందే లీనము అగుచు, స్థితి కాలమునందు ఆత్మ స్వరూపము అయిఉన్నది. అందువలననే సమస్తము ఆత్మస్వరూపమే అగుచున్నది.

ద్రాక్షారామం

 


తూర్పుగోదావరి జిల్లా.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆహ్లాదకరమైన వాతావరణం. అలాంటి వాతావరణంలో ఎంతో చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైంది ద్రాక్షారామం. ఇక్కడి భీమేశ్వరుడిని దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మీరు కూడా ఓసారి వచ్చి చూడండి.

తూర్పుగోదావరి జిల్లాలోని సప్తగోదావరి తీరాన వెలసిన భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. కాశ్యాంతు మరనాన్ముక్తిఃజీవనం మరణం వాపి శ్రేయో భీమేశ్వరపట్టణే.. అంటే..‘కాశీలో నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది. భీమేశ్వరుడిని పూజిస్తే, కొన్ని క్షణాలైనా ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యం, కైవల్యం రెండూ లభిస్తాయి’ అని అర్థం. తెలుగుసీమ పంచారామాలకు ప్రసిద్ధి చెందింది. త్రిపురాసురుణ్ణి పాశుపతాస్త్రంతో అంతమొందించిన పరమేశ్వరుడు, ఆ అసురుడు అర్పించే శివలింగాన్ని అయిదు ఖండాలు చేయగా.. అవి ప్రతిష్ఠితమైన ప్రాంతాలే పంచారామాలని పురాణాలు చెబుతున్నాయి. ఆ లింగ శకలాలు పాలకొల్లులో క్షీరారామేశ్వరుడిగా, సామర్లకోటలో కొమరారామ మూర్తిగా, అమరావతిలో అమరేశ్వరుడిగా, భీమవరం, ద్రాక్షారామ క్షేత్రాల్లో భీమేశ్వరుడుగా పూజలు అందుకొంటున్నాయి

ద్రాక్షారామ భీమేశ్వరాలయం- నాలుగువైపులా నాలుగు ఎత్తయిన రాజగోపురాలతో, పన్నెండు ఎకరాలకుపై బడిన విస్తీర్ణంలో ఉంది. ఆలయానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ధ్వజస్తంభం 70 అడుగుల పొడుగున దర్శనమిస్తుంది. ఎత్తయిన రాతిగోడలతో నిర్మించిన సుదీర్ఘ ప్రాకారాల మధ్య మాణిక్యాంబతో కొలువుదీరిన భీమేశ్వరుడి దివ్యసన్నిధి కైలాస సభావేదికను తలపిస్తుంది. 

భీమేశ్వరుణ్ణి దర్శించేందుకు భక్తులు మొత్తం అయిదు ప్రాకారాలు దాటాల్సి ఉంటుంది. బయటి ప్రహరీ నుంచి వెళ్తే, ఇంకో ప్రాకారం వస్తుంది. దాని మధ్య ప్రధానాలయం రెండు అంతస్థులుగా ఉంటుంది. రెండో ప్రాకారం నుంచి గర్భాలయానికి వెళ్లడానికి మెట్లుంటాయి. సుమారు ఇరవై అడుగుల ఎత్తుండే పైఅంతస్థులో మళ్లీ మూడు ప్రాకారాలు ఉంటాయి. వీటిని ప్రదక్షిణ చేస్తూ గర్భాలంయంలోకి ప్రవేశించవచ్చు. ఈ ప్రదక్షిణ మార్గాన్నే ‘చీకటి కోణం’ అంటారు. విద్యుచ్ఛక్తి లేని రోజుల్లో ఈ ప్రాకారాలు కటిక చీకటితో నిండి ఉండేవి. అందువల్ల వీటిలోని మొదటి రెండు ప్రాకారాల గోడలపై రాతి బొడిపెలు కనిపిస్తాయి. మునుపు ఈ బొడిపెల్లో నవరత్నాలు పొదిగారనీ, అవి భక్తులకు వెలుగులు అందించేవనీ అంటారు. చివరిగా అయిదో ప్రాకారంలో స్ఫటిక లింగ రూపంలో భీమేశ్వరుడు భక్తులకు తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. దిగువ అంతస్థులోని అట్టడుగు పీఠం నుంచి భీమేశ్వర లింగం, సుమారు నలభై అడుగుల పొడవు ఉంటుంది.

ప్రధాన ఆలయానికి తూర్పున అశ్వత్థ నారాయణ వృక్షం ఉంది. సంతానం లేనివారు, లౌకిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ వృక్షాన్ని భక్తితో కొలిస్తే సంతతి కలుగుతుందనీ, సమస్యలు పరిష్కారం అవుతాయనీ భక్తులు విశ్వసిస్తారు. సప్త గోదావరిగా వ్యవహరించే పవిత్ర పుష్కరిణికి వెళ్లే తోవలో సప్తర్షులు, అరుంధతీ దేవి ప్రతిమలు ఉన్నాయి. అత్రి, భృగు, కౌస్త, వశిష్ఠ, గౌతమ, కశ్యప, అంగీరస రుషులు, వశిష్ఠుడి ధర్మపత్ని అరుంధతి శిల్పాలు చిన్న చిన్న గుళ్లలో దర్శనమిస్తాయి. ప్రధాన ప్రాకారంలో అనేక మంటపాలున్నాయి. వాటిని కొట్టార, గాంగేయరాయ, గండభేరుండదేవ, నంది, దీపావళి, నాట్య, శనివార, గయ, అర్క, తిరుచుట్టుమాలిక, మృగయా రామ మంటపాలని అంటారు.

ద్రాక్షారామంలో నిత్యోత్సవాల్ని నిర్వహించేందుకు వీలుగా వందల సంఖ్యలో రాజులు, జమీందారులు భూ, కనక, వస్తు, వాహన, ద్రవ్య, రూపాల్లో పెద్ద ఎత్తున విరాళాలిచ్చారు. ఉత్సవాలకు విచ్చేసే యాత్రికుల వసతుల కోసం సత్రాల్ని నిర్మించారు. ఏటా మాఘమాసంలో 8 నుంచి 10 రోజుల పాటు ఇక్కడ కల్యాణోత్సవాలు జరుగుతాయి. అంకురార్పణ, ధ్వజారోహణ, అభిషేకాదుల్ని నిర్వహిస్తారు. ఏటా మార్గశిర పౌర్ణమి రోజున, ఆరుద్ర నక్షత్రం ప్రవేశించే సందర్భంలో ఆర్ద్రోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంలో క్రతువులు నిర్వహించి హవిస్సును అర్పిస్తారు. చైత్ర పౌర్ణమి నాడు మాణిక్యాంబ, భీమేశ్వరుల్ని ప్రత్యేకంగా దవనంతో అర్చిస్తూ ఉయ్యాల్లో ఊపుతూ డోలోత్సవాన్ని జరుపుతారు

వేసవిలో స్వామిని వనవిహారానికి తీసుకు వేళ్లే ‘తోట ఉత్సవం’, ఉగాది ముందు రోజు ‘కొత్త’ అమావాస్య నాడు ‘మాఘంత దాసోత్సవం’ ద్రాక్షారామంలో ఏటా నిర్వహిస్తారు. వీటితో పాటు చైత్రమాసంలో ‘గౌరీ వ్రతం’, వైశాఖ మాసంలో ‘అక్షయ తృతీయ చందనోత్సవం’ ప్రసిద్ధి చెందినవి. ఏడాది పొడవునా వేడుకలతో అలరారే ద్రాక్షారామానికి చేరుకోవడానికి రాజమండ్రి, కాకినాడల నుంచి ప్రతి అరగంటకూ బస్సులున్నాయి. స్వయంభువుడైన సాంబశివుణ్ణి భీమేశ్వర లింగ రూపంలో దర్శిస్తూ- ‘నమఃపార్వతీపతయే హరహరమహాదేవ’ అని ఎలుగెత్తి ఘోషించే భక్తులకు ద్రాక్షారామం అవశ్య దర్శనీయం.

గంగతో సమానమైన దధీచి కుండం

 


గంగతో సమానమైన దధీచి కుండం- జీవితంలో ఒక్కసారైనా అందులో స్నానం చేయాల్సిందే!

88వేల నదుల్లో స్నానమాచరించే ఫలితం- సకల పాపాలను పోగొట్టే దధీచి కుండం విశిష్టత తెలుసా?

వ్యాస మహర్షి చెప్పినట్లుగా కృతయుగం తో సమానమైన యుగం కానీ, వేదం తో సమానమైన శాస్త్రం కానీ, కార్తిక మాసంతో సమానమైన మాసం కానీ, గంగా తీర్థం తో సమానమైన తీర్థం కానీ లేదని అంటారు. అలాంటి పరమ పావనమైన గంగానదిలో సమానమైన తీర్థం మన దేశంలో ఎక్కడుందో తెలుసా! కేవలం స్పర్శతోనే సమస్త పాపాలు నశింపజేసే ఆ తీర్థ రాజం విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.దధీచి కుండం విశిష్టత

ఉత్తర్ప్రదేశ్లోని నైమిశారణ్యం పురాణాలు పుట్టిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నైమిశారణ్యంలో ఋషులు, మునులను తపస్సు చేసుకోవాలని ఆదేశించినట్లుగా స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం ద్వారా తెలుస్తోంది. ఇంతటి పావన ప్రదేశమైన నైమిశారణ్యంలో దధీచి కుండం ఉంది. ఈ దధీచి కుండంలోని నీటిని తలపై చల్లుకున్నా, స్నానం చేసినా 88 వేల నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని, సమస్త పాపాలు నశించి పుణ్యరాశి పెరుగుతుందని శాస్త్ర వచనం. దధీచి కుండానికి ఇంతటి మహత్యం ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న పౌరాణిక గాధ ఏమిటి?ఘనత వహించిన మన మహర్షులు

మన దేశం ఇంత సుభిక్షితంగా తేజోమయంగా ఉంది అంటే దానికి కారణం ఎంతో మంది మహర్షులు ఈ గడ్డపై జన్మించటమే అని చెప్పాలి. వాళ్ళు చేసిన యాగాలు, వారు ధారపోసిన తపస్సుల ఫలితమే దేశ సుభిక్షానికి కారణం. భూమి మీద ఆధ్యాత్మికత వెల్లివిరిస్తోంది అంటే ఇంకా ఇలాంటి మహర్షుల ఆశీర్వాదాలు మన మీద ఉండబట్టే అనటంలో సందేహం లేదు. ఇలాంటి మహనీయుల గురించి తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం.ఎవరీ దధీచి?

దధీచి మహర్షి అథర్వణ ఋషికి, చితికి కలిగిన సంతానం. చిన్నతనం నుంచే ఆయనకు భగవంతుని పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండటం వల్ల సరస్వతి నది ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. దధీచి విష్ణువుని ప్రసన్నం చేసుకుని తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించేలా వరాన్ని పొందుతాడు.సురాసురుల యుద్ధం

ఒకసారి రాక్షసులు వృతాసురుని ఆధ్వర్యంలో స్వర్గాధిపతి ఇంద్రునిపై యుద్ధానికి వెళ్లారు. దేవతల వద్ద ఉన్న అస్త్రశస్త్రాలను దోచుకోవాలన్న ఉద్దేశ్యంతో వారు చేసిన ఈ భీకర యుద్ధంలో వృత్తాసురుడిని ఎదుర్కొనే బలం లేక దేవతలు స్వర్గం నుంచి బయటకి పరుగులు తీసి దధీచి దగ్గరకు వచ్చి వారి అస్త్రశస్త్రాలను జాగ్రత్తగా దాయమని ఇచ్చి వాళ్ళు తిరిగి పరుగులు తీస్తారు. దధీచి దగ్గరకు వచ్చి ఆయన తేజస్సుని ఎదుర్కొనే ధైర్యం లేక రాక్షసులు వెనక్కి వెళ్ళిపోతారు.


అస్త్రశస్త్రాలను అవపోసిన పట్టేసిన దధీచి

దధీచి మహర్షి దేవతలు వచ్చి వారి అస్త్రశస్త్రాలను తిరిగి తీసుకెళ్తారని ఎంతో కాలం ఎదురుచూసి వాళ్ళు రాకపోవటంతో ఆ అస్త్రశస్త్రాలను తన కమండలంలో కరిగించి వాటిని ఆయనే అవపోసన పట్టేస్తారు.శ్రీ మహావిష్ణువును ఆశ్రయించిన ఇంద్రాది దేవతలు.ఆదిత్యయోగీ.

వృత్తాసురుడి బారి నుండి తమను రక్షించమని ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువుని కోరుతారు. దానికి విష్ణుమూర్తి దధీచి మహర్షి శరీరంలో ఉన్న ఎముకలను ఆయుధంగా మార్చి దానితో సంహరిస్తే వృత్తాసురుడు మరణిస్తాడని చెపుతారు.దధీచిని వేడుకున్న దేవతలు

దేవతలందరూ దధీచి దగ్గరకు వెళ్లి వాళ్ల కోరికను విన్నవించుకున్నారు. దధీచి తన వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో వాళ్ల కోరికను నెరవేరుస్తానని మాట ఇస్తాడు. అయితే చనిపోయే ముందు తనకి భూమి మీద ఉన్న అన్ని నదులలో స్నానం చేయాలని ఉందని ఇంద్రుడికి చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు నైమిశారణ్యంలో తగిన ఏర్పాట్లు చేసి దధీచి కోరికను తీరుస్తాడు. ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరం ఉన్నందువల్ల దధీచి తన ప్రాణాలను విడిచిపెడతాడు. అప్పుడు కామదేనువైన ఆవు వచ్చి దధీచి శరీరాన్ని తన నోటితో రాస్తూ మాంసాన్ని మొత్తం తీసి ఎముకలను బయటకు తీస్తుంది. అలా వచ్చిన ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేసి దానితో వృత్తాసురుడిని చంపుతాడు ఇంద్రుడు.దధీచి కుండం ఇలా ఏర్పడింది!

లోక కల్యాణం కోసం దధీచి మహర్షి తన శరీరాన్ని వదిలేయడానికి సిద్ధపడిన సమయంలో ఆయన కోరిక మేరకు ఇంద్రాది దేవతలు 88 వేల నదీ జలాలతో ఆయనకు స్నానం చేయించారు. అలా ఆయనకు స్నానం చేయించిన నీటితో ఏర్పడినదే 'దధీచి కుండం'.పాపనాశిని దధీచి కుండం

నైమిశారణ్యం వెళ్లినవారు ఈ కుండంలోని నీటిని 'గంగతో సమానమైనవిగా భావిస్తుంటారు. దధీచి కుండంలోని నీటిని తలపై చల్లుకున్నా, స్నానం చేసినా 88 వేల నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని చెబుతారు. సమస్త పాపాలు నశించి పుణ్యరాశి పెరుగుతుందని అంటారు. మనం కూడా జీవితంలో ఒక్కసారైనా నైమిశారణ్యం వెళ్లి దధీచి కుండం లోని నీటి స్పర్శతో పావనమవుదాం. 

పళని మురుగన్‌ మహత్యం

 

పళని మురుగన్‌ మహత్యం

అంతుబట్టని నవ పాషాణం!


అటు చరిత్రకీ ఇటు శాస్త్రీయతకీ అందని అసాధారణ నైపుణ్యానికీ విజ్ఞానానికీ చూడచక్కని ఆనవాళ్లు భారతీయ దేవాలయాలు.


వాస్తునిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే, మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని. అలాంటివాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం.




సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్య క్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలోని ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నులపండువగా జరుగుతుంది. అందులో పాల్గొన్నవాళ్లకి సంతానప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు.


నిరవధికంగా పదహారు గంటలపాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసం, వైకాశి, అగ్నినక్షత్రం... ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేర రాజు చేరమాన్‌ పెరుమాళ్‌ పునర్నిర్మించినట్లూ ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లూ తెలుస్తోంది.


నిజానికి విగ్రహం క్రీ.పూ. మూడువేల సంవత్సరాలనాటిదనీ చాలాకాలం నిర్లక్ష్యానికి గురైందనీ, చేరమాన్‌ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెబుతారు.ఆదిత్యయోగీ.


మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళని. పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండమీద ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతోపాటు రోప్‌ వే లాంటి సౌకర్యమూ ఉంది. గర్భగుడిలోని స్వామి పదేళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకుని కౌపీనధారిగా దర్శనమిస్తాడు. 


"అన్నీ వదిలేసి నన్ను చేరుకో" 

అన్నదే స్వామి అలా కనబడటంలోని అంతరార్థమట. ఇక్కడి సుబ్రహ్మణ్యుడిని దండాయుధపాణి, బాల సుబ్రహ్మణ్యం, మురుగన్‌, శరవణన్‌... ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు.


"స్థలపురాణం"

ప్రమద గణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికీ శివుడు పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి, నిరాశతో ప్రస్తుతం పళని ఆలయం ఉన్న పర్వతం మీదకు చేరుకుని మౌనంగా కూర్చుండిపోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుణ్ణి బుజ్జగించి, ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకూ అధిపతివి నీవే అని చెబుతూ జ్ఞానఫలాన్ని అందించారట. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండమీదే కొలువుంటానని తల్లితండ్రులకు చెబుతాడు. దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి జ్ఞానం సిద్ధిస్తుందనీ శివుడు వరమిస్తాడట. తమిళంలో 'పళం' అంటే 'ఫలం', 'నీ' అంటే 'నీవు' అని అర్థం. అందుకే ఇది పళని అయ్యిందట.


కావడీ ఉత్సవం!

దేవదానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే, ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని దగ్గరకు వస్తాడు. శరణు కోరినవాడిని చంపడం భావ్యం కాదని భావించిన ఆ ఋషి, కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి రెండు కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి, శక్తిగిరి అనే రెండు పర్వతాలను కావడిలో భూమిమీదకు తీసుకువస్తాడు. పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువవడంతో- కావడిని కిందపెట్టి సేదతీరతాడు ఇడుంబుడు. కావడిని మళ్లీ పైకెత్తబోతే అది లేవదు సరికదా, అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు- కొండమీదకి పరుగెడతాడు. చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి, మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి, కావడీలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్ళకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు. 'నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తార'నీ చెబుతాడు. అందుకే కావళ్లలో పాలు, నెయ్యి, విభూతి, తేనె, పూలు... వంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందనీ దాంపత్య దోషాలు తొలగిపోతాయనీ నమ్ముతారు.


ఏమిటీ నవ పాషాణం!

పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు పళని ఆలయాన్ని తప్పక సందర్శించేవారు. ఆలయంలోని మూలవిరాట్టుని దర్శించుకుని, తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులూ తొలగిపోతాయని నమ్మేవారు.


దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే. కానీ ఇక్కడి స్వామి మూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాలతో "భోగర్‌" అనే సిద్ధుడు తయారుచేశాడట. అందుకే దీన్ని నవ పాషాణం అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త, తొమ్మిది అనీ; పాషాణ అంటే విషం, ఖనిజం అనీ అర్థాలు ఉన్నాయి. భోగర్‌ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటినుంచి తొమ్మిది విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారుచేశాడని కొందరంటే, అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో తొమ్మిదింటిని సేకరించి ఈ నవపాషాణాన్ని చేశాడని మరికొందరు సిద్ధ వైద్యులు చెబుతున్నారు. ఎలా చేసినప్పటికీ ఔషధగుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలూ పంచామృతాలు మందులా పనిచేస్తాయట. అప్పట్లో స్వామివారి ఊరువు భాగం నుంచి తీసిచ్చిన విభూతితో కుష్టురోగం నయమయ్యేదని అంటారు. క్రమేణా ఆ భాగం అరిగిపోతుండటంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట. ఈ విగ్రహానికి స్వేదం (చెమట) పట్టడం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందనీ, గంధంతోపాటు కారే నీటిచుక్కలు ఆకుపచ్చరంగులో ఉంటాయనీ అంటారు. వీటిని ఒడిసిపట్టేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు. దీన్నే కౌపీనతీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అయితే విగ్రహాన్ని లక్షలకొద్దీ బ్యాక్టీరియాలతో చేసి ఉంటారనీ, అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడంవల్ల ఆ బ్యాక్టీరియా లోపలకు వెళ్లి వాటి సంఖ్య పెరగడంవల్లే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణమన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన.ఆదిత్యయోగీm


"ఎవరీ సిద్ధ భోగర్‌?"

క్రీ.పూ. 550-300 కాలానికి చెందిన భోగర్‌ పళని కొండల సమీపంలోని వైగావూర్‌లో జన్మించాడు. ఈయన తన తల్లి, తాతల దగ్గర విద్యను అభ్యసించి, కాలంగి నాథర్‌ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడనీ ఆయన రాసిన సప్తకంద పుస్తకం ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయేవారట. కారణమేంటనేది తెలిసేది కాదు. దాంతో భోగర్‌ కలియుగంలో వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్‌ విగ్రహాన్ని రూపొందించి, పూజించాడట. కన్నివాడిలోని మైకంద సిద్ధర్‌ గుహలో పులిప్పాని అనే ప్రధాన శిష్యుడి సాయంతో భోగర్‌ దీన్ని తయారుచేసి, పళని కొండమీద ప్రతిష్ఠించాడనీ, ఆపై విగ్రహాన్ని పాలూ పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడనీ చెబుతారు. విగ్రహం ఉన్న కొండ కింద గుహలోనే భోగర్‌ జీవసమాధిలోకి వెళ్లినట్లు చెబుతారు.


తమిళనాట పేరొందిన పద్ధెనిమిది మంది సిద్ధుల్లో కాలంగి నాథర్‌ ఒకరు. గురువైన కాలంగి నాథర్‌ చివరి కోరిక మేరకు భోగర్‌ తన విద్యను వ్యాప్తి చేసేందుకు చైనాకు వెళ్లినట్లూ; శ్రీలంక మీదగా తామ్రపర్ణియన్‌ అనే సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లూ సప్తకందలో రాసుకున్నాడు. పులిప్పాని వంశీకులు పదహారో శతాబ్దం వరకూ ఈ ప్రాంతంలో ఉండేవారనడానికి ఆధారాలున్నాయి. పైగా ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులెందరో ప్రయత్నించారు. కానీ ఏమిటనేది తెలియలేదు. అయితే "గట్టి లింగం, గుర్రంపన్ను, నల్ల పాషాణం, రస సింధూరం, తెల్ల పాషాణం, రక్త పాషాణం, కంబి నవరసం, కౌరి పాషాణం, సీలై పాషాణం" ఇలా తొమ్మిది రకాల విషపూరిత ఔషధ మూలికలతో ఈ విగ్రహాన్ని తయారుచేశారని కొందరంటారు. ఆ మూలికలకోసం కొందరు వ్యక్తులు ఈ విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారనీ అంటారు. 


అందుకే... పళని మురుగన్‌ నవపాషాణం అన్నది కేవలం విశ్వాసం కాదు, అంతుబట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం..!


పంచామృతం!

లడ్డూ ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తుకొచ్చినట్లే, పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తుకొచ్చేది పళని సుబ్రహ్మణ్యస్వామే. మహత్తరమైన రుచీ ఔషధ, పోషక గుణాలున్న ప్రసాదం. ఇది కొన్ని నెలలు నిల్వ ఉంటుందట. ఎంత పాతబడితే అంత రుచి అనీ అంటారు. అందుకే స్వామివారి దర్శనానంతరం ఆ ప్రసాదం డబ్బా లేకుండా భక్తులు వెనుతిరగరు. పళని కొండల్లోని విరుప్పాచ్చి అనే ఊళ్లో మాత్రమే పండే వేలెడంత సైజు తియ్యని అరటిపండ్లను చిదిమి దానికి కంజీయం ప్రాంతంలో పండించే చెరకుతో చేసిన ముడి పంచదార చేర్చి, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, యాలకులు, నెయ్యి సరైన పాళ్లలో కలిపి తయారుచేస్తారు....*






తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

  తిరుమల  వేంకటేశ్వర స్వామి  ధృవబేరము 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరా...