26, జూన్ 2018, మంగళవారం

CHITHRAGUPTHUDI TEMPLES IMPORTANCE

ఇక్కడ చిత్రగుప్తుడి ఆలయ దర్శనంతో అకాల మృత్యు భయం పోతుంది
మనుష్యుల పాప పుణ్యాలను అనుసరించి వారికి శిక్ష విధించడం యమధర్మరాజు విధి అని మన పురాణాల్లో చెప్పబడిన విషయం తెలిసిందే. ఆ యముడికి భారత దేశంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. వీటిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.
ఎందుకంటే యమధర్మరాజు ప్రాణాలు తీసే వాడని ప్రజలు నమ్ముతారు. ఆయన నుంచి ఎంత దూరం ఉంటే అంత మంచిదని భావిస్తుండటం వల్ల యమధర్మరాజుకు ఆలయాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో లేవు. ఇదిలా ఉండగా ఈ విశ్వంలో కోట్లాది జీవుల పాపపుణ్యాలను యమధర్మరాజు ఒక్కడే లెక్కగట్టలేడు కదా. ఆయనకు ఈ విషయంలో సహకారం అందించడానికి ఉన్న వ్యక్తి చిత్రగుప్తుడు.
ఈయనకు కూడా భారత దేశంలో అక్కడడక్కడా ఆలయాలు కనిపిస్తాయి. ఆ ఆలయాల దర్శనం వల్ల ఆకాల మృత్యు భయం పోతుందని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో గరుడ పురాణంలోని చిత్రగుప్తుడి జననంతో పాటు ఆయన ఆలయాల గురించి కథనం మీ కోసం
ఈ విశ్వం ప్రారంభం తర్వాత భూలోకంలోని జీవులు చనిపోయినప్పుడు వారి ఆత్మలు స్వర్గానికి లేదా నరకానికి వెళ్లేవి. ఇలా వెళ్లిన ఆత్మల పాపాలను నిర్ణయించడంలో యమధర్మరాజు కొంత గందరగోళానికి గురయ్యేవాడు.
ఎందు కంటే ఎవరు ఎంత పాపం చేసింది సరిగా నిర్ణయించలేకపోయేవాడు. దీంతో తన ఇబ్బందిని యమధర్మరాజు తండ్రి, స`ష్టికర్త అయిన అయిన బ్రహ్మకు విన్నవించాడు. దీంతో సమస్య పరిష్కారం కోసం కొద్దికాలం బ్రహ్మ యోగనిద్రలోకి వెళ్లాడు.
కళ్లుతెరిచిన తర్వాత ఆయనకు ఎదురుగా ఓ ఆజానుబాహుడు కనిపించాడు. చేతిలో పుస్తకం, ఘటం (పెన్ను), నడుముకు కత్తి ఉంటాయి. తర్వాత తన దివ్యద`ష్టితో జరిగిన విషయం తెలుసుకొంటాడు. ఆ వ్యక్తి తన చిత్తం (శరీరం)లో గుప్తంగా (గుప్తంగా) నివాసమున్నవాడని అర్థమవుతుంది.
దీంతో అతనికి చిత్రగుప్తుడని పేరుపెడతాడు. అటు పై నీవు ఈ విశ్వంలోని ప్రతి జీవిలో రహస్యంగా ఉంటూ వారి మంచి చెడులను గూర్చి తెలుసుకొంటూ ఉంటావు. ఈ విషయాలన్నీ యమధర్మరాజుకు చెబుతూ పాపాత్ములకు శిక్షలు పడేవిధంగా సహాయపడుతావని చెబుతాడు.
అంతేకాకుండా ఏక కాలంలో కొన్ని కోట్ల రూపాలను ధరించే శక్తి కూడా నీకు ఉంటుందని బ్రహ్మ చిత్రగుప్తుడికి వరమిస్తాడు. అంతేకాకుండా చిత్రగుప్తుడికి ఈ విషయంలో సహాయపడటానికి కొంతమంది సహాయకులుగా కూడా ఉంటారు.
వారిలో ద్వారపాలకుడైన ధ్వజుడితో పాటు బ్రహ్మమానసపుత్రులైన శ్రవణులు. శ్రవణులు ఈ భూ లోకం పైనే కాకుండా పాతాళ, మత్స్య, స్వర్గ లోకాల్లో కూడా వివహరిస్తూ జీవుల పాప పుణ్యాలను ఎప్పటికప్పుడు చిత్రగుప్తుడికి తెలియజేస్తూ ఉంటారు.
ఇక యమపురి ద్వారపాలకుడైన ధ్వజుడు కూడా చనిపోయి నరకానికి వచ్చిన వారి గురించి చిత్రగుప్తుడికి ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాడు. అందువల్లే ఈ విశ్వంలోని జీవుల పాపపుణ్యాలను చిత్రగుప్తుడు ఖచ్చితంగా నిర్ణయించగలుగుతున్నాడని గరుడ పురాణం చెబుతోంది.
ఇక చిత్రగుప్తుడికి భారత దేశంలో చాలా తక్కువ చోట్ల మాత్రమే దేవాలయాలు ఉన్నాయి. అందులో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా ఒకటి ఉంది. అయితే చిత్రగుప్త దేవాలయం ఉన్నట్లు అక్కడి స్థానికులకు కూడా సరిగా తెలియక పోవడం గమనార్హం.
పాతబస్తీలోని నల్లవాగు స్మశాన వాటిక దగ్గర ఉన్న ఈ దేవాలయం కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు చెబుతారు. అయితే 250 ఏళ్ల క్రితం నిజాం నవాబుల కాలంలో రాజా కిషన్ పర్షాద్ అనే మంత్రి దీనిని అభివ`ద్ధి చేశాడు.
మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయం చాలా వరకూ కబ్జాకు గురయ్యింది. అయితే ఇటీవల ప్రభుత్వం ఈ ఆలయ సంరక్షణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆలయ నిర్వాహకుల సహకారంతో శివాలయం, సాయిబాబా ఆలయం, హనుమంతుడి ఆలయం, అయప్పస్వామి దేవాలయం నిర్మించింది.
దీంతో ప్రస్తుతం ఈ దేవాలయాన్ని చిత్రగుప్త ఆలయం అనడానికి బదులు నాలుగు స్వాముల దేవాలయం అని పిలుస్తున్నారు. ఇక ప్రధాన ఆలయంలో చిత్రగుప్తుడి రాతి విగ్రహం ఉంది. బుధవారం చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు.
బుధవారంతో పాటు దీపావళి రోజు మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీపావళి రెండో రోజును యమద్వితీయ అని అంటారు. ఆరోజును చిత్రగుప్తుడి పుట్టిన రోజును నిర్వహిస్తారు. దీనినే భాయ్ దూజఖ్ అంటారు.
అకాల మృత్యువును జయించడానికి మాత్రమే ఆరోగ్యం, చదువు, పెళ్లి, సంతానం కోసం ఇటీవల ఈ దేవాలయాన్ని సందర్శించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంతేకాకుండా కేతు గ్రహ దోష నివారణ పూజలు కూడా ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి.
హైదరాబాద్ లోనే కాకుండా భారత దేశంలో అక్కడక్కడా చిత్రగుప్తుడి దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా రాముడి జన్మస్థలమైన అయోధ్యలో కూడా చిత్రగుప్తుడి దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో శ్రీరాముడు స్వయంగా పూజలు చేసినట్లు చెబుతారు.
అదేవిధంగా మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లోని ఫూటాతాల్, షిప్రా నదీ తీరంలోని రామ్ ఘాట్, ఉజ్జయినీ, ఖజురహోలో కూడా చిత్రగుప్తుడి దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు మూడు వందల ఏళ్లకు పూర్వం నిర్మించినవే.
అదే విధంగా రాజస్థాన్ లోని ఆల్వార్ తో పాటు తమిళనాడులోని మధురైలో కూడా చిత్రగుప్తుడి దేవాలయం ఉంది. ఇదిలా ఉండగా యముడంటే ప్రజలు ఎలా భయపడుతున్నారో అలాగే చిత్రగుప్తుడంటే కూడా ప్రజలకు కొంత భయం. అందువల్లే ఆయన ఆలయాలు ఎక్కువగా లేవు. ఉన్న ఆలయాలు కూడా ప్రాచూర్యంలోకి రాకపోవడానికి భయం కారణమని ఆధ్యత్మిక వేత్తలు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

  తిరుమల  వేంకటేశ్వర స్వామి  ధృవబేరము 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరా...